Breaking News

ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌

Published on Thu, 09/26/2024 - 20:24

సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్‌ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. రిటైల్‌ లిక్కర్‌ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్‌ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన మద్యం విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే..

నూతన లిక్కర్‌ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్టోబర్‌ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది. నూతన మద్యం పాలసీపై మహిళలు భగ్గుమంటున్నారు. గాంధీ జయంతి రోజున రోడ్లపై ధర్నాలు చేస్తామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

అయితే, 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా మద్యంపై పెత్తనం ప్రైవేట్‌ వ్యక్తులదే ఉండేది. పేరుకు టెండర్లయినా.. కొంతమంది చేతుల్లోనే వైన్‌షాపులుండేవి. బార్లు, వైన్‌షాపులన్న తేడా లేకుండా.. అంతా సిండికేట్‌గా మారిపోయేవారు. వారు నిర్ణయించిందే ధరకే అధికంగా వసూలు చేసేవారు. దాడులు చేసి, అక్రమ దందాను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. మామ్మూళ్లకు అలవాటుపడి, చోద్యం చూసేవారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే.. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి సిండికేటుగాళ్లకు చెక్‌ పెట్టింది. ప్రైవేట్‌ వ్యక్తులకే మద్యం దుకాణాలను కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయంతో​ ఇప్పుడు మళ్లీ పాత విధానమే అమలులోకి రానుంది.

ఇదీ చదవండి: సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!!

 

 

 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు