Breaking News

Operation Sindhu: ఏపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు

Published on Tue, 06/24/2025 - 11:08

సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందులో భాగంగా.. ఇరాన్‌ నుంచి స్వస్థలానికి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ చేరుకున్న విమానంలో ఐదుగురు ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్లంతా కెర్మన్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు వాళ్లు. 

‘‘నాలుగు రోజుల నుంచి ఇరాన్‌ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. మమ్మల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది.  ఢిల్లీ నుంచి స్వయంగా మేమే మా ఖర్చులతో నంద్యాలకు  వెళ్తున్నాం. మిగతా వాళ్లకు వాళ్ల వాళ్ల రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. మాకు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా, ఏపీ ప్రభుత్వం కూడా చేస్తే బాగుండేది.. 

.. మేము ఉన్న ప్రాంతంలో యుద్ధం ప్రభావం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా కాలేజీ యాజమాన్యం సెలవులు ఇచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. యుద్ధం రావడం వల్ల సెమిస్టర్ పరీక్షలు ఆగిపోయాయి. కాలేజీ యాజమాన్యం పిలిస్తే మళ్లీ వెంటనే ఇరాన్ వెళతాం అని నంద్యాలకు చెందిన నరేందర్‌, నారాయణలు తెలిపారు. 

ఆపరేషన్‌ సిందు గురించి.. 
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్‌ ఇది. మొదటి దశలో.. జూన్ 19న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందినవారు. రెండో దశలో జూన్ 21న మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి తరలించబడ్డారు. ఈ విమానం ఢిల్లీలో సాయంత్రం 4:30కి ల్యాండ్ అయింది. మొత్తం ఇప్పటివరకు: 827 మందిని భారత్‌కు సురక్షితంగా తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఆపరేషన్‌ సిందు కోసం.. ఇరాన్ ప్రభుత్వం భారత పౌర విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. ఈ ఆపరేషన్‌లో రోడ్డుమార్గం ద్వారా అర్మేనియాకు తరలించి, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు తీసుకురావడం వంటి వ్యూహాత్మక చర్యలు కూడా తీసుకున్నారు.

యుద్ధం ఇలా.. 
జూన్‌ 13వ తేదీన ఇరాన్‌ నుంచి ప్రపంచానికి అణు ముప్పు ఉందని చెబుతూ ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట దాడులకు దిగింది ఇజ్రాయెల్‌. ప్రతిగా ఇరాన్‌ సైతం మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడులు జరిపింది. చివరకు.. ట్రంప్‌ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాలు మంగళవారం (జూన్‌24న) కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ముగిసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)