Breaking News

కర్నూలు: ఉల్లి రైతు కంట కన్నీరు

Published on Tue, 09/16/2025 - 18:35

సాక్షి,  కర్నూలు: జిల్లాలో రైతులకు ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను రైతులు దున్నేస్తున్నారు. పత్తికొండ రూరల్‌లో పులికొండ రైతు పొలాన్ని దున్నేశారు. టమోటా, ఉల్లి పంటలు తమ కొంప ముంచాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానికులు ఉల్లి దోపిడీ చేస్తున్నారు. మార్కెట్‌లోనే రైతులు ఉల్లినివదిలేసి వెళ్తున్నారు. రైతులు వదిలేసి వెళ్లిన ఉల్లిని స్థానికులు ఫ్రీగా తీసుకెళ్తున్నారు. బైకులపై ఆటోలలో ఉల్లిగడ్డ మూటలను స్థానికులు ఎత్తుకెళ్తున్నారు.

పత్తికొండ టమోటా మార్కెట్‌ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించారు టమోటాకు ధర లేక రైతులు బాధలు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేదని శ్రీదేవి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విత్తనం నుండి విక్రయం దాకా రైతాంగానికి అండగా జగనన్న ఉండేవారని.. రైతులు టమోటాలను రోడ్డుపై పారవేస్తున్నా కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గాని స్పందించిన దాఖలాలు లేవంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా టమోటాకు గిట్టు బాటుధర కల్పించాలని శ్రీదేవి డిమాండ్ చేశారు.

రైతుల ఆవేదనను పట్టించుకోకుండా గిట్టుబాటు ధర ప్రకటించడంపై రైతన్నలు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మితే కోత ఖర్చులు కూడా రావంటూ పొలాన్ని రైతులు దున్నేస్తున్నారు. 1200 గిట్టుబాటు ధర సరిపోదంటూ మరింత నష్టాల్లో కూరుకుపోకుండా పత్తికొండ రైతులు.. పంటను దున్నేస్తున్నారు. కనీసం 2500 రూపాయల గిట్టుబాటు ధర కల్పించి ఉల్లిని కొనుగోలు చేయాలని రైతలు డిమాండ్  చేస్తున్నారు. పొలంలో ఉల్లి పంటలు దున్నివేస్తున్న రైతులను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరామర్శించారు. కంగాటి శ్రీదేవితో రైతులు తమ బాధలు వెళ్లబోసుకున్నారు.

గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను దున్నేసిన రైతు

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)