పాశర్లపూడి సమీపంలో ఓఎన్‌జీసీ ఆయిల్‌ లీక్‌

Published on Mon, 09/29/2025 - 15:43

కోనసీమ: మరొకసారి  కోనసీమ వాసుల్లో  ఓఎన్‌జీసీ ఆయిల్‌ లీక్‌ ఘటన కలవరం పుట్టిస్తోంది. తాజాగా మామిడికుదురు మండలం పాశర్లపూడి ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ సైటు సమీపంలో ఆయిల్‌ లీకవుతున్న ఘటన వెలుగుచూసింది.  ఈరోజు(సోమవారం, సెప్టెంబర్‌ 29వ తేదీ) పాశర్లపూడికి అత్యంత సమీపంలోని పంట కాల్వలోకి  ఓఎన్‌జీసీ ఆయిల్‌ లీకవుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. దాంతో ఆందోళన చెందిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. 

అయితే  ఓఎన్‌జీసీ ఆయిల్‌ లీవ్‌ అవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజలను కలవరపెడుతున్న నేపథ్యంలో మరొకటి చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తరుచుగా జరుగుతున్న ఘటనలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. 

పాశర్లపూడి ప్రాంతంలో ఓఎన్‌జీసీ (ONGC) ఆయిల్ , గ్యాస్ లీకేజీలు అనేక సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. ప్రధాన లీకేజీ ఘటనలు ఇవే..

  • 1995–96: పాశర్లపూడిలో ఓఎన్‌జీసీ బావిలో భారీ బ్లోఅవుట్ (Blowout) జరిగింది. ఈ ప్రమాదంలో 60 రోజుల పాటు మంటలు చెలరేగాయి,

  • ఇది ఓఎన్‌జీసీ చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదంగా గుర్తించబడింది.

  • 2014 జూన్ 28: నాగారం వద్ద గ్యాస్ పైప్ లైన్ లీక్ కారణంగా 15 మంది సజీవ దహనమయ్యారు, మరో 15 మంది గాయపడ్డారు.

  • 2022 సెప్టెంబర్ 27: పాశర్లపూడి వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ జరిగింది. అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.

  • 2025 సెప్టెంబర్ 23: పాశర్లపూడి వెళుతున్న పైప్ లైన్ వద్ద మరోసారి గ్యాస్, ఆయిల్ లీక్ జరిగింది. స్థానికులు వాసనను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.

  •  2025 ఆగస్టు: డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ పైకి రావడంతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. అధికారులు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశారు.

  • Pasarlapudi: ఓఎన్‌జీసీ ఆయిల్‌ లీక్‌

 

ఇదీ చదవండి: 
హోంమంత్రి అనితకు నిరసన సెగ.. కాన్వాయ్‌ అడ్డగింత

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)