Breaking News

విద్యార్థినిపై క్షుద్ర పూజ ప్రయోగం

Published on Tue, 01/28/2025 - 11:34

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు నగర శివారులోని బి.తాండ్రపాడు ఎస్‌ఆర్‌ కాలేజీలో క్షుద్ర పూజ ప్రయోగం కలకలం సంచలనం సృష్టించింది. ఈ నెల 26వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో హాస్టల్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని చంపే ప్రయత్నం చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె గాఢనిద్రలో ఉండగా జుట్టుకు కత్తిరించాడు. తరువాత చంపబోయే సమయంలో ఆ విద్యార్థిని నిద్రలేచి కేకలు వేయడంతో దుండగుడు పారిపోయినట్లు తెలుస్తోంది.

అయితే ఆ అమ్మాయి బెడ్‌పై కిల్‌యూ అనే లెటర్, పదునైన కత్తి, రెండు భాగాలు చేసిన నిమ్మకాయ ఉండడంతో క్షుద్ర  పూజ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆ గదిలో మొత్తం ఏడుగురు విద్యార్థినులు నిద్రిస్తుండగా ఉండగా..అందులో బాగా చదివే విద్యార్థినినే టార్గెట్‌ చేయడం గమనార్హం. కాగా, గతంలో కూడా ఒక అమ్మాయిపై క్షుద్ర పూజలు జరిగాయని, అప్పట్లో ఆమె కళ్లు తిరిగి కింద పడిపోయిందని యాజమాన్యం వారి తల్లిదండ్రులకు చెప్పి సముదాయించినట్లు సమాచారం. ఇప్పుడు మళ్లీ కాలేజీలో క్షుద్ర పూజల ప్రయోగం జరగడంతో మిగతా విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు.  

తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని కళాశాల యాజమాన్యం... 
కాగా.. క్షుద్ర పూజల సంఘటనపై బాధిత  విద్యార్థిని తల్లిదండ్రులకు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. అయితే తోటి విద్యార్థులు కొందరు విషయాన్నివారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు సోమవారం కాలేజీకి చేరుకొని ఆందోళన చెందారు. యాజమాన్యాన్ని సమాచారం అడిగిన సరైన సమాధానం ఇవ్వలేదు. ఈవిషయాన్నివిద్యార్థి, మహిళా సంఘాలు తెలుసుకొని కాలేజీ ఎదుట ఆందోనకు దిగాయి.  

అస్తవ్యస్తంగా హాస్టల్‌ నిర్వహణ... 
ఎస్‌ఆర్‌ కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్టల్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీలో మహిళా సెక్యూరిటీ గార్డులు ఉండాల్సి ఉన్నా ఉండడంలేదు. కాలేజీలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. అంతేకాక మహిళా వార్డెన్‌లు కూడా లేరని చెబుతున్నారు. అయినా యాజమాన్యం మాత్రం విద్యారి్థనుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.  

ఆర్‌ఐఓ విచారణ.. 
ఎస్‌ఆర్‌ కాలేజీలో అమ్మాయిపై క్షుద్రపూజల కలకలం నేపథ్యంలో ఆర్‌ఐఓ గురవయ్యశెట్టి విచారణచేపట్టారు. ఆయన కాలేజీకి చేరుకొని బాధిత విద్యారి్థని, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇంతవరకు కేసు నమోదుకాలేదు.  

 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)