Breaking News

అనంత ఎమ్మెల్యే ప్రసాద్‌ దిష్టిబోమ్మ దహనం

Published on Tue, 08/19/2025 - 05:36

కడప రూరల్‌/మదనపల్లె రూరల్‌/కర్నూలు(సెంట్రల్‌): అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చేసిన పరుష వ్యాఖ్యలపై అభిమానులు తీవ్ర ఆగ్ర­హం వ్యక్తం చేశారు. కడపలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద సోమ­వారం జిల్లా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ యూత్‌ లీడర్స్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ దిష్టిబోమ్మను దహనం చేశారు. 

ఈ సందర్భంగా అసోసియేషన్‌ నేత సునీల్‌కుమార్, రామారావు మాట్లాడుతూ.. సినీరంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యే దగ్గు­పాటి ప్రసాద్‌ అధికార మదంతో దూషించడం దారుణమన్నారు. జూ.ఎన్టీఆర్‌∙నటించిన సినిమాలను ఆడబోనివ్వమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలను ఆపడం ఎవరి తరం కాదన్నారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌­కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ తక్షణం స్పందించాలన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌కు, ఆయన తల్లి శాలినికి, అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు బుల్లెట్‌ సాయి, హరి తదితరులు పాల్గొన్నారు. 

పోలీసుల అదుపులో అభిమానులు
జూనియర్‌ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మె­ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌పై చర్యలు తీసుకోవా­లని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి కోరిన అభిమానులను సోమవారం మధ్యాహ్నం వరకు మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. దీనిపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మదనపల్లె జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు టెంపర్‌ రాజేష్‌ మాట్లాడుతూ.. తమ హీరోకు మద్దతుగా నిరసన తెలిపేందుకు అను­మతి కోరితే పోలీసులు నిరాకరించారన్నారు. అనంత ఎమ్మెల్యే ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అభిమానులు వినతిపత్రం సమర్పించారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నాకు జూ.ఎన్‌టీఆర్‌ ఫ్యాన్స్‌ యత్నించారు. దీంతో పోలీసులు వారిని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో వారంతా స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)