Breaking News

AP: ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం

Published on Mon, 10/06/2025 - 14:56

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడింది. నకిలీ మద్యాన్ని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావు గోడౌన్‌గా గుర్తించారు. జనార్ధన్‌ సోదరుడు జగన్మోహన్‌రావు, అనుచరుడు కట్టా రాజులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్‌రావు, కట్టా రాజు ఇచ్చిన సమాచారంతో జనార్ధనరావు గోడౌన్‌లో తనిఖీలు చేపట్టారు. గోడౌన్‌లో భారీగా నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ మద్యం బాటిళ్లకు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు, 35 లీటర్ల కెపాసిటీ కలిగిన 95 క్యాన్లు సీజ్ చేశారు. హోలోగ్రామ్ స్టిక్కర్లు , వందల కొద్దీ ఖాళీ బాటిళ్లు, కేరళ మార్ట్, ఓఎస్‌డీ బ్రాండ్లకు చెందిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్, కారిమిల్‌ను మిక్స్ చేసి నకిలీ మద్యాన్ని నిందితులు సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత, ఏ1 జనార్థన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జనార్ధన్‌ ఆఫ్రికా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. జనార్ధన్‌ విదేశాల్లో ఉన్నట్లు తెలిసిందని ఎక్సైజ్‌ సీఐ తెలిపారు.

మరోవైపు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఎక్సైజ్‌ దాడులు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం తయారీ డంప్‌వద్ద బయటపడ్డ డైరీ ఆధారంగా ఎక్సైజ్‌ పోలీసులు సోదాలు చేపట్టారు. పీటీఎం మండలం సోంపల్లి గ్రామంలో బెల్ట్‌షాపుపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. పక్క జిల్లాలకు  కల్తీ మద్యం సరఫరా చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)