Breaking News

ఎన్‌పీఎస్‌పీఎల్‌కు నజరానా

Published on Sun, 04/19/2026 - 06:00

సాక్షి, అమరావతి: ఏడాది క్రితం కోల్‌కతాలో ఏర్పాటైన ఎన్‌పీఎస్‌పీఎల్‌ కెమికల్స్‌కు పెట్టుబడిలో 75 శాతం రాయితీలతో పాటు చిత్తూరు జిల్లాలో 110 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌పీఎస్‌పీఎల్‌ కెమికల్స్‌ రూ.2,250 కోట్ల పెట్టుబడితో బ్యాటరీల్లో  వినియోగించే కాథోడ్‌ తయారీ యూనిట్‌ను చిత్తూరు జిల్లా గుడుపల్లె వద్ద ఏర్పాటు చేస్తోంది. వాస్తవ ధర ప్రకారం 110 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ ఎల్రక్టానిక్స్‌ కొంపొనెంట్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ పాలసీ 2025–30 ప్రకారంభారీ ప్రోత్సాహకాలను ఇచ్చింది. పెట్టుబడిలో 60 శాతం క్యాపిటల్‌ ఇన్సెంటివ్‌తో పాటు పదేళ్ల పాటు 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ, పదేళ్లపాటు యూనిట్‌కు రూ.2 చొప్పున విద్యుత్‌ సబ్సిడీ ఇలా అన్ని సబ్సిడీలు కలిసి పెట్టుబడిలో 75 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. అలాగే సెమీకండక్టర్స్‌ రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు 75 శాతం సబ్సిడీ ధరలతో 60 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. 

శ్రీ సత్యసాయి జిల్లా టేకులోడు వద్ద లో రూ.10,239.78 కోట్లతో సెమీకండక్టర్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తొలి దశలో 30 ఎకరాలను కేటయించి మలిదశలో మరో 30 ఎకరాలు కేటాయించడానికి భూములను రిజర్వ్‌ చేసిన ఉంచనున్నట్లు ఆ ఉత్తర్కులోపేర్కొన్నారు. వీటితో పాటు 30 శాతం క్యాపిటల్‌ సబ్సిడీ, 10 ఏళ్లపాటు 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు వంటి అనేక ప్రోత్సాహకాలను విడుదల చేసింది. విశాఖపట్నం మధురవాడలో ఎకరం రూ.1.5 కోట్లు చొప్పున 3.5 ఎకరాలు ఐస్ప్రౌంట్‌ డెవల్పర్స్‌కు కేటాయిస్తూ ఉత్తుర్వులను జారీ చేసింది. ఇందులో 50 శాతం భూమిని ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది. 

మరో  రియల్‌ ఎస్టేట్‌ సంస్థ క్రెడెన్స్‌ రియాల్టీ విశాఖలో అభివృద్ధి చేయనున్న ఐటీ క్యాంపస్‌కు వీఎంఆర్‌డీఏ మౌలికవసతులు కల్పించాల్సిందిగా ఉత్తర్వులో పేర్కొన్నారు. ఫ్యూజీ సాఫ్ట్‌వేర్‌సొల్యూషన్స్‌ సంస్థ విశాఖ కాపులుప్పాడ ఐటీ హబ్‌లో ఎకరం రూ.4 కోట్లు చొప్పున రెండు ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.  శ్రీసిటీలో పీటీ టెక్నొప్లాస్ట్‌ ఏర్పాటు చేయనున్న వాషింగ్‌మెïÙన్లు, ఎయిర్‌ కండీషన్ల తయారీ యూనిట్‌కు పలురాయితీలను ప్రకటించింది. అదానీ డేటా సెంటర్,  కే.రహేజా ఐటీ పార్కులతో పాటు పలు కంపెనీలకు గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలను సవరిస్తూ పలు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)