Breaking News

వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని తొలగిస్తాం

Published on Mon, 06/24/2024 - 04:30

కాకినాడ రూరల్‌: కాకినాడ నగరం 49వ డివిజన్‌­లోని పైడా వారి వీధి రాజేశ్వరి నగర్‌ ప్రాంతంలో అనుమతి లేకుండా వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాల­యం నిర్మిస్తున్నారని కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. సెక్షన్‌ 452(1) అండ్‌ 461(1) ఆఫ్‌ ఏపీఎంసీ యాక్ట్, సెక్షన్‌ 89 (1అండ్‌2), రెడ్‌ విత్‌ సెక్షన్‌ 82, 90(1) ఆఫ్‌ ఏపీఎంఆర్‌ అండ్‌ యూడీఏ యాక్ట్‌–2016 కింద నిర్మాణంలో ఉన్న భవనానికి ఆదివారం నోటీసులు అతికించారు.

 తదుపరి నిర్మాణాన్ని తక్షణం ఆపివేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును ఆదేశించారు. అనధికార నిర్మాణాన్ని ఎందుకు తొలగించకూ­డదో తగిన కారణం చూపాలని నోటీసులో పేర్కొ­న్నారు. కన్నబాబు లేదా ఆయన అను­మతి పొందిన వారి ద్వారా ఏడు రోజుల్లో రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు. 

టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ కడి­యాల శ్రీరమ్య డిజిటల్‌ సిగ్నేచర్‌తో ఈ నోటీసు జారీ అయ్యింది. దీనిపై టౌన్‌ ప్లానింగ్‌ విభాగం డీసీపీ హరిదాస్‌ను వివరణ కోరగా, అనుమతి కోసం దరఖాస్తు చేశారని.. అప్రూవల్‌ అవ్వ­లేదన్నారు.  

కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నోటీసులు 
కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ జిల్లా కడపలోని రామాంజనేయపురంలో నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్లాన్‌ అప్రూవల్‌ లేకుండా నిర్మిస్తున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కార్యాలయం వద్ద గోడలకు నోటీసులు అంటించారు. పోస్ట్‌ ద్వారా కూడా నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)