Breaking News

నోటాకు బాగానే నొక్కారు

Published on Sat, 06/08/2024 - 10:30

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇష్టం లేకుంటే నోటాపై నొక్కి ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. ఈ  ఎన్నికల్లో పలువురు ఓటర్లు నన్‌ ఆఫ్‌ ది అ»ౌ(నోటా)కు ఓటు వేశారు.  ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాకుండా కొంతమంది తెలిసో, తెలియకో ఈవీఎంలపై నోటా బటన్‌ నొక్కారు. దీంతో విజయవాడ  పార్లమెంటరీ పరిధిలో భారీగానే నోటా ఓట్లు పోలయ్యాయి. పోటీలో ఉన్న వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పారీ్టల మినహా ఇతర రాజకీయ పారీ్టలు, స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్ల కంటే నోటాకు పడిన ఓట్లే అధికం కావడం విశేషం. 

దేశంలో 2013 నుంచి.. 
కేంద్ర ఎన్నికల సంఘం 2013 నుంచి నోటాను ప్రవేశపెట్టింది. అభ్యర్థులు నచ్చక చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో పోలింగ్‌ శాతం తగ్గుతోంది. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల్లో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలనే లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నోటాను అమలులోకి తెచ్చింది.  అభ్యర్థులు ఇష్టం లేకున్నా ఓటర్లు పోలింగ్‌ బూత్‌కు వచ్చి నోటాకు ఓటు వేయడం ద్వారా పోలింగ్‌ శాతం పెరుగుతోంది.
 
జిల్లాలో నోటాకు పడిన ఓట్లు ఇలా 
👉ఎన్టీఆర్ జిల్లాలో నోటాకు ఈసారి ఎన్నికల్లో  గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఈవీఎంలు, సర్వీసు ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌లను పరిగణనలోకి తీసుకుంటే విజయవాడ  పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 7,719 ఓట్లు నోటాకు పడ్డాయి. వీటికంటే పార్లమెంటరీ స్థానానికి నోటా ఓట్లు అధికంగా పోలవడం        విశేషం. పార్లమెంటరీ స్థానానికి 9,193 మంది నోటాకు ఓటు వేశారు. 

👉విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 17 మంది పోటీ చేశారు. వీరిలో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారు 14 తొమ్మిది మంది ఉండటం గమనార్హం. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు మినహా మిగిలిన వారందరికీ నోటా కంటే తక్కువగానే ఓట్లు నమోదయ్యాయి.
 
👉 విజయవాడ ‘పశి్చమ’ నుంచి 15 మంది పోటీ చేశారు. వీరిలో వైఎస్సార్‌ సీపీ, బీజేపీ,  సీపీఐ అభ్యర్థులు మినహా మిగిలిన 12 మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,236 కంటే తక్కువే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యరి్థకి కేవలం 39 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

👉 విజయవాడ ‘సెంట్రల్‌’ నుంచి 20 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, సీపీఎం, ఆంధ్రరాష్ట్ర ప్రజాశాంతి, బహుజన సమాజ్‌ పార్టీ  మినహా మిగిలిన వారికి నోటా ఓట్లు 951 కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. 15 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగానే నమోదయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఒక స్వతంత్ర అభ్యరి్థకి అత్యంత తక్కువగా 37 ఓట్లు పోలయ్యాయి. 

👉 విజయవాడ ‘తూర్పు’ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో వైఎస్సార్, టీడీపీ, కాంగ్రెస్, బహుజన సమాజ్, ఆల్‌ ఇండియా జైహింద్‌ పార్టీ మినహా మిగిలిన 10 మంది అభ్యర్థుల కంటే నోటాకే అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 1,049 మంది     ఓటు వేశారు. 

👉 నందిగామ నియోజకవర్గం నుంచి తొమ్మిది   మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్‌ సీపీ, టీడీపీ,  కాంగ్రెస్, బహుజన సమాజ్‌ పార్టీ∙అభ్యర్థులు మినహా మిగిలిన ఐదుగురు అభ్యర్థులకు నోటా ఓట్లు 928 కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యరి్థకి బహుజన సమాజ్‌వాదీ పార్టీ కంటే తక్కువ ఓట్లు పోలవ్వడం విశేషం. 

👉జగ్గయ్యపేట నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వైఎస్సార్‌ సీపీ, టీడీపీ,   కాంగ్రెస్‌ పారీ్టల మినహా మిగిలిన పది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 773 కంటే అతి తక్కువ ఓట్లు పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఒక స్వతంత్ర అభ్యరి్థకి 11 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. 

👉మైలవరం నుంచి 12 మంది బరిలో నిలిచారు. వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ, ఒక స్వతంత్ర అభ్యర్థి మినహా మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,598 కంటే తక్కువగా పడటం గమనార్హం. 

👉 తిరువూరు నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ మినహా మిగిలిన తొమ్మిది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,184 కంటే తక్కువగా వచ్చాయి.

  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)