Breaking News

టీడీపీ ఐటీ కార్‌ ర్యాలీకి అనుమతి లేదు

Published on Sun, 09/24/2023 - 03:42

కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/­గరికపాడు­(జగ్గయ్యపేట): స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమా­ండు ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర­బాబునాయుడుకు సంఘీభావంగా టీడీపీ ఆధ్వ­ర్యంలో హైదరాబాద్‌ నుంచి ఐటీ ఉద్యోగులు చేప­ట్టిన కార్‌ ర్యాలీకి అనుమతి లేదని రాష్ట్ర పోలీ­సులు స్పష్టం చేశారు. చలో రాజమండ్రి పేరుతో ఆది­వారం హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వరకు చేప­ట్టిన ర్యాలీ చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఈ ర్యాలీ నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసు­కుంటామని హెచ్చరించారు.

వాహనాల యజ­మా­నులు, డ్రైవర్లపైన కూడా చర్యలు తీసుకుంటా­మని చెప్పారు. ముందస్తు భద్రత చర్యలో భాగంగా తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఎన్టీఆర్‌ జిల్లా గరిక­పాడు వద్ద శనివారం రాత్రి పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ డీసీపీ ఎ.అజిత పర్యవేక్షణలో నందిగామ డీఎస్పీ జనా­ర్దన్‌­నాయుడు, సీఐ జానకిరామ్‌ ఆధ్వర్యంలో పికెట్‌ ఏర్పా­టు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చ­రించారు.

ర్యాలీ చేస్తే నిర్వాహకులపై చర్యలు: తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్‌
తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు సెక్షన్‌–144, పోలీస్‌ యాక్ట్‌–30 అమలులో ఉన్నందున ఎటువంటి ర్యాలీలు, యాత్రలు, ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ ప్రొఫెష­నల్స్‌ పేరుతో చేపట్టిన కారు సంఘీభావ యాత్రకు ఎటువంటి అనుమతి లేదని, జిల్లాలోకి ఈ యాత్ర ప్రవేశిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కారు యజమాని, డ్రైవర్ల లైసె­న్సు­లు రద్దు చేస్తామని స్పష్టంచేశారు. రవాణా శాఖ అధి­కారులు తనిఖీలు చేసి వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, డ్రైవింగ్‌ లైసెన్సు­లను రద్దు చేస్తారని చెప్పారు. ఈమేరకు ఆర్టీవోకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జిల్లా ప్రజల ప్రశాంత జీవనానికి ఆటంకం లేకు­ండా అన్ని చర్యలు తీసుకోవాలని, శాంతిభద్ర­తలను కాపాడాలని పోలీస్‌ అధికారులను ఆదేశించామని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)