Breaking News

నూతన ఆవిష్కరణలతోనే పేదరిక నిర్మూలన

Published on Fri, 11/21/2025 - 04:52

ప్రశాంతి నిలయం: సాంకేతిక విజ్ఞా­నం ద్వారా నూతన ఆవిష్కరణలతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నా­రు. శ్రీసత్య­సాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సాయికుల్వంత్‌ సభా మందిరంలో గురువారం సత్యసాయి శతజయంతి వే­డు­కలలో భాగంగా సత్యసాయి సే­వాసంస్థల 11వ జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హా­జౖ­రెన గడ్కరీ మాట్లాడుతూ.. సత్యసాయి బాబా ఆధ్యాత్మిక బోధనలు, సేవా కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చారన్నారు. తాను ఇక్కడి భక్తిభావనను, విలువలను, సేవా భావాన్ని చూసి ప్రేరణ పొంది తదుపరి జీవితంలో మరింత మంచి చే­యాలనే తపనతోనే వచ్చానని చెప్పారు.

ప్రతి మ­నిషిలో సత్ప్రవర్తన, మంచి సాంగత్యం, ఉన్నత వి­ద్యాగుణం ఉత్తముడిలా తీర్చిదిద్దుతాయన్నారు. ఎ­దు­టి వ్యక్తి అవసరాలను గుర్తించి చేతనైన సాయం చేసే గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. సత్యసాయిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు నడిపే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థల  కార్యక్రమాల వివరాలతో కూడిన పుస్తకాన్ని సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యులు విడుదల చేశారు. అంతకుముందు గడ్కరీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)