Breaking News

గిఫ్ట్‌ రద్దు అధికారం జగన్‌కు ఉంది

Published on Thu, 05/08/2025 - 04:24

సాక్షి, హైదరాబాద్‌: చెల్లెలిపై ప్రేమ, అభిమానంతో చేసుకున్న తొలి ఒప్పందమే రద్దయినప్పుడు... ఆ ఒప్పందం ప్రకారం చేసుకున్న గిఫ్ట్‌డీడ్‌ చెల్లుబాటే కాదని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఎన్‌సీఎల్‌టీలో న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘చెల్లెలు షర్మిలపై ప్రేమ, అభిమానాలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెకు తన సొంత ఆస్తుల్లో వాటా ఇవ్వాలనుకున్నారు. ఆయన ఇవ్వాలనుకున్న ఆస్తి కుటుంబ వారసత్వంగా వచ్చింది కాదు. ఆయన సొంత ఆస్తి. ఈ మేరకు 2019లో తల్లి, చెల్లెలు సమక్షంలో ఎంఓయూ చేసుకున్నాక... పలు ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి కనక కేసులన్నీ తేలాక ఎంఓయూ ప్రకారం ఆమెకు ఆస్తులు బదలాయించాలని భావించారు. 

కానీ 2024లో షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో చేరారు. జగన్‌ను, ఆయన ప్రభు­త్వాన్ని బహిరంగంగా తూలనాడుతూ విమర్శలు చేశారు. సయోధ్యకు జగన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని తండ్రి ఎవరికివ్వాల్సింది వారికిచ్చారని, ప్రేమాభిమానాలతో తాను ఇస్తానన్న ఆస్తులు ఆమె అంతలా తూలనాడుతున్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్‌ భావించారు. 

తీరు మారకపోతే ఎంవోయూ రద్దు చేసుకుంటానని చెప్పారు. దీంతో షర్మిల తమ తల్లి విజయమ్మపై ఒత్తిడి తెచ్చి సరస్వతి పవర్‌లో షేర్లను చట్టవిరుద్ధంగా బదిలీ చేయించుకున్నారు. షేర్‌ సర్టిఫికెట్, షేర్‌ బదిలీ ఫారం పోయిందని చెప్పి.. అక్రమంగా బదిలీ చేసేసుకున్నారు. ఇది చట్టవిరుద్ధం. 51 శాతం షేర్లున్న వ్యక్తికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బదిలీ చేయటం న్యాయవిరుద్ధం’అని జగన్‌ న్యాయవాది పేర్కొన్నారు. 

గిఫ్ట్‌డీడ్‌కు సంబంధించి విజయమ్మ ఓ ట్రస్టీ మాత్రమేనని, ఆమెకు షేర్లు బదిలీ చేసే అధికారం లేదని జగన్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. బాండ్‌ కాపీని కోర్టుకు ఇవ్వాలని కోరగా... ఇప్పుడు లేదని, తెప్పించి ఇస్తామని చెప్పారు. బోర్డు భేటీకి తాను హాజరుకాకున్నా హాజరైనట్లు పత్రాలు సృష్టించారని డైరెక్టరు యశ్వంత్‌ తరఫు న్యాయవాది వెల్లడించారు. విజయమ్మ, జగన్‌ కలిసే ఉంటున్నారని.. తల్లి అంటే ఆయనకు ప్రేమ, అభిమానం ఉన్నాయని విజయమ్మ తరఫు సీనియర్‌ న్యాయవాది వివేక్‌రెడ్డి చెప్పారు. 

ఒకే ఇంట్లో ఉంటున్నారు కనుక షేర్‌ సర్టిఫికెట్‌ జగన్‌ వద్ద ఉన్నా.. విజయమ్మ వద్ద ఉన్నా ఒకటేనన్నారు. రాజీవ్‌ భరద్వాజ్‌(జ్యుడిషీయల్‌), సంజయ్‌ పూరి(టెక్నికల్‌)తో కూడిన బెంచ్‌ ఈ వాదనలు విన్న అనంతరం... తదుపరి విచారణను మే 30కి వాయిదా వేసింది. అప్పటిలోగా లిఖిత పూర్వక వాదనలుంటే సమర్పించాలని న్యాయవాదులకు స్పష్టం  చేసింది.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)