Breaking News

ఏం కష్టమొచ్చిందో...!

Published on Sun, 08/24/2025 - 11:08

కొత్తవలస(విజయనగరం): ఓ పెళ్లిలో వారి చూపులు కలిశాయి. ఇద్దరూ ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. పెళ్లితో ఐదునెలల కిందట ఒక్కటయ్యారు. కొత్తింటిలో కాపురం పెట్టారు. వేర్వేరు ప్రదేశాల్లో పనిచేస్తూ.. ఆనందంగా జీవిస్తున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు... ఒకరి తర్వాత ఒకరు ప్రాణం తీసుకున్నారు. ఈ విషాదకర ఘటనతో కొత్తవలస మండలం తమ్మన్నమెరక ఘొల్లుమంది. గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కన్నీరు కార్చుతున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

కొత్తవలస మండలం తమ్మన్నమెరక గ్రామానికి చెందిన గీతల వెంకటలక్ష్మి (26), వేపాడ మండలం చిన్నదుంగాడ (కొప్పలవానిపాలెం) గ్రామానికి చెందిన కొప్పల చిరంజీవి (30)కి ఈ ఏడాది మార్చి నెలలో వివాహం జరిగింది. వెంకటలక్ష్మి తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే మృతి చెందారు. ఆమెకు దివ్యాంగుడైన తమ్ముడు రాజేష్‌ ఉన్నాడు. కొత్తవలస పట్టణంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తూ తమ్ముడిని సాకుతూ ఓ ఇంటివాడిని చేసింది. ఓ పెళ్లిలో వెంకటలక్ష్మిని చిరంజీవి చూసి ఇష్టపడడంతో పెద్దలకు తమ మనుసులోని మాటను చెప్పడంతో పెళ్లిచేశారు. వెంకటలక్ష్మికి గత ప్రభుత్వ హయాంలో తమ్మన్నమెరక గ్రామంలోని జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం పూర్తికావడంతో అందులోనే కొత్తకాపురం పెట్టారు. ఇద్దరు డిగ్రీ విద్యను అభ్యసించడంతో చిరంజీవి పెందుర్తి సమీపంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వెంకటలక్ష్మి కొత్తవలస పట్టణంలోని ఓ బంగారం షాపులో సేల్స్‌ ఉమెన్‌గా పని చేస్తోంది.

ప్రాణం తీసిన మనస్పర్థలు...
అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో వెంకటలక్ష్మి భర్త చిరంజీవికి నీవు అనుకున్నట్లే చనిపోతున్నాను.. నీకు సంతోషమే కదా అని మెసేజ్‌ పెట్టింది. దీనికి వెరీగుడ్‌ అంటూ చిరంజీవి రిప్లై ఇచ్చాడు. సరే.. నేను షాపు నుంచి ఇంటికి ఆటోలో వెళ్లిపోతున్నాను అని మెసేజ్‌ చేస్తే ఒకే.. అంటూ ఆయన రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లిన వెంటనే వెంకటలక్ష్మి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. ఆ వెంటనే ఇంటికి వెళ్లిన చిరంజీవి వెంకటలక్ష్మిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి అదే తాడుతో చిరంజీవి ఉరివేసుకున్నాడు. 

శనివారం తెల్లవారు జూ మున బంధువులు చూ సి పోలీసులకు సమాచా రం ఇచ్చారు. సీఐ షణ్ముఖరావు, పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి అన్నదమ్ములు మా త్రం తమ్ముడు, మరదలను కావాలనే ఎవరో చంపేసి అత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీమ్‌ బృందం ఆధారాలను సేకరించింది. మృతురాలి త మ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)