Breaking News

వైఎస్సార్‌ ఏపీ 1 పోర్టల్‌ను ఆవిష్కరించిన మంత్రి అమర్నాథ్‌

Published on Mon, 03/27/2023 - 13:36

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఏపీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ 2023- 27 వైఎస్‌ఆర్‌ ఏపీ 1 పోర్టల్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌, డైరెక్టర్‌ సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నూతన  ఇండస్ట్రియల్‌ పాలసీ రూపకల్పనలో పారిశ్రామిక వేత్తల ఆలోచనల్ని పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు. ఎకనామికల్‌ గ్రోత్‌ అనేది ప్రధాన అంశంగా తీసుకున్నట్లు చెప్పారు.  వైఎస్‌ఆర్‌ ఏపీ పోర్టల్‌ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో పాటు మూడు వారాల్లోనే పరిశ్రమలకు భూమి కేటాయింపు ఉంటుందన్నారు.

దేశంలో 3 కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామన్నారు. విశాఖ వేదికగా జీ20 సదస్సుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సదస్సు రేపట్నుంచి 30 వరకు జరగనుంది. ఇందుకు 40 దేశాల నుంచి 200 మంది దేశ, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖలో జీఐఎస్‌ విజయవంతం కాగా జీ20 సదస్సును కూడా అదే రీతిలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖను అత్యంత సుందరంగా జీవీఎంసీ అధికారుల తీర్చిదిద్దారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)