Breaking News

తిరుమలలో వేంకటాద్రి నిలయం

Published on Fri, 09/26/2025 - 05:14

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం వేంకటాద్రి నిలయం అందుబాటులోకి వచ్చింది. రూ.102 కోట్లతో టీటీడీ నిర్మించిన ఈ పిలిగ్రిమ్స్‌ అమెనిటీస్‌ సెంటర్‌ (పీఏసీ)–5ను గురువారం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ముందస్తు బుకింగ్‌ లేకుండా వచ్చే వారిలో ఒకేసారి నాలుగువేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా ఈ భవనాన్ని నిర్మించారు. 

దీన్లో 16  డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడినీటి సదుపాయం, ఒకేసారి 1,400 మంది భక్తులు భోజనం చేసేలా రెండు పెద్ద డైనింగ్‌ హాళ్లు  తదితర సౌకర్యాలు కల్పించారు. ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణకట్టను కూడా పీఏసీ–5 ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 

ఈ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు ఒక భక్తురాలికి వసతి బుకింగ్‌ టోకెన్‌ను అందజేశారు. అనంతరం తిరుమల పోటులో ఏర్పాటు చేసిన సారి్టంగ్‌ యంత్రాలను ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యర్థాల సేకరణ యంత్రాన్ని ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పరిశీలించారు.  

టెక్నాలజీతో క్యూలైన్ల నిర్వహణకు ఐసీసీసీ   
అనంతరం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచే పర్యవేక్షించాలని ఆదేశించారు. అలిపిరి నుంచే రద్దీ హీట్‌ మ్యాప్‌లను గుర్తించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీవారి ఏడుకొండలు ఏడురంగులతో గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలను ఐసీసీసీతో అనుసంధానించాలన్నారు. 

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. ఏఐ, క్వాంటం రెడీ అనలటిక్స్, మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో ఎంతమంది భక్తులు నిరీక్షణలో ఉన్నారో గుర్తించి అందుకనుగుణంగా క్యూలైన్‌ నిర్వహణ చేపడతామని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, లోకేశ్, సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు,  ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, తిరుపతి జిల్లా కలెక్టర్‌ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకష్ణ పాల్గొన్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం 
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద ఉప రాష్ట్రపతికి టీటీడీ అధికారులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి లడ్డూప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఉప రాష్ట్రపతి, సీఎం ఆలయంలో సుమారు 50 నిమిషాలు ఉన్నారు. ఈ  సందర్భంగా సుమారు గంటన్నరపాటు సాధారణ భక్తుల దర్శనాన్ని టీటీడీ నిలిపేసింది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌  తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారినీ దర్శించుకున్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)