Breaking News

ఆపరేషన్‌ సిందూర్‌.. స్పందించిన నెల్లూరు మధుసూదన్‌ కుటుంబ సభ్యులు

Published on Wed, 05/07/2025 - 10:39

సాక్షి, నెల్లూరు: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రతీకార చర్యల నేపథ్యంలో పహల్గాం బాధిత మధుసూదన్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఉగ్రవాదులు అనేవారు లేకుండా భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలి అని వ్యాఖ్యానించారు. అలాగే, ఉగ్రవాదుల చేతిలో మరెవరో ప్రాణాలు కోల్పోకుండా భారత్ చర్యలు తీసుకోవాలని అన్నారు.

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై నెల్లూరుకు చెందిన మధుసూదన్‌ రావు కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు తల్లి పద్మావతి మాట్లాడుతూ..‘ఎన్ని యుద్దాలు చేసినా.. నా కొడుకును తీసుకురాలేరు. నా కడుపు కోత ఏ తల్లి పడకుండా ఉగ్రవాదులను అంతం చేయాలి. నా కొడుకు అమాయకుడు, మా కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారు. ఉగ్రవాదుల చేతిలో మరెవరో ప్రాణాలు కోల్పోకుండా భారత్ చర్యలు తీసుకోవాలి అని అన్నారు.

మధుసూదన్ సోదరి విజయలక్ష్మి మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత దాడులు చేయడం మా కుటుంబానికి ఊరట కలిగిస్తోంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్నని కోల్పోవడం మా కుటుంబానికి తీరని లోటు. ఇప్పటికి కూడా ఆ షాక్ నుంచి మేము తేరుకోలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

మధుసూదన్ మామ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ..‘ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు భారత్ మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలి. అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్న వారిని గట్టిగా శిక్షించాలి అని డిమాండ్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)