Breaking News

నేడే నీట్‌ యూజీ

Published on Sun, 05/04/2025 - 06:08

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ యూజీ–2025ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆదివారం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెన్, పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో కలిపి 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. గతేడాది నీట్‌ యూజీ ప్రశ్నపత్రం లీక్‌తో పాటు ఇతర అవకతవకలు చోటు చేసుకోవడంతో.. ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని అన్ని జిల్లాల యంత్రాంగాలను ఎన్‌టీఏ ఆదేశించింది.  

జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లు.. 
ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్‌ రాసే అవకాశముందని అంచనా. గతేడాది 24.06 లక్షల మంది దరఖాస్తు చేయగా 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి గతేడాది 66 వేల మంది  దరఖాస్తు చేయగా.. 64 వేల మంది పరీక్షకు హాజరయ్యా­రు. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే రాష్ట్రం నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాలు, పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీలోని ప్రభు­త్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో 6,500 మేర సీట్లు ఉన్నాయి.

#

Tags : 1

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)