Breaking News

ద్రాక్షారామంలో శివాలయంపై దాడి.. నిందితుడు టీడీపీ కార్యకర్త?

Published on Wed, 12/31/2025 - 11:52

సాక్షి, ద్రాక్షారామం: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. అనంతరం, మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు.

ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘ద్రాక్షారామాం ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడం దారుణం.  ఎటువంటి సంప్రోక్షణ చెప్పకుండా హడావిడిగా మరో లింగాన్ని ఎందుకు ప్రతిష్టించారు. ధ్వంసమైన శివలింగానికి వేల ఏళ్ళ చరిత్ర ఉంది. హడావుడిగా కార్యక్రమం ఎందుకు చేశారు?. వ్యవస్థలను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. మాట్లాడితే సనాతన ధర్మం అంటున్నారు. ఇదేనా సనాతన ధర్మం అంటే?. ఆలయ నిర్వహణ అధికారి ఆలయానికి రెగ్యులర్‌గా ఎందుకు రావటం లేదు అని ప్రశ్నించారు.

మరోవైపు.. దేవాలయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ..‘ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో విధ్వంసం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?. ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునః ప్రతిష్టించటం అపచారం కాదా?. టీడీపీ కూటమి పాలనలో సనాతన ధర్మం ప్రమాదంలో పడింది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లారు?. ఆలయాలపై జరుగుతున్న దాడులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడికి ఐదు లక్షల రూపాయల సాయం ఎందుకు ఇచ్చారు?. చంద్రబాబు సర్కారుకు రాజకీయ లబ్ధి మినహా హిందువుల మనోభావాలు అక్కర్లేదా? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా హుటాహుటిన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్, ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని రామచంద్రపురం మండలం తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడి సోదరుడు అధికార టీడీపీ కార్యకర్త అని తెలిసింది. నిందితుడు కూడా టీడీపీ కార్యకర్త అని సమాచారం. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)