Breaking News

పని చేయకపోతే ఇల్లెలా గడుస్తాది.. నారాయణుడి జీవిత గాథ

Published on Mon, 01/13/2025 - 07:50

యేటి సేత్తామ్.. అందరికి అనుకున్నట్లు అవుతాదేటీ.. ఎవలికి ఏది ప్రాప్తమో.. అదే దక్కుతాది.. నువ్వెంత ఎగిరినా కాణీ ఎక్కువ రాదు.. అంటాడు నారాయణ. అచ్చం రజనీ కాంత్ చెప్పినట్లే చెప్పాడు.. దక్కేది దక్కకుండా పోదు.. దక్కనిది ఎన్నటికీ దక్కదు అనే మాటను నారాయణ సింపుల్‌గా చెప్పేసాడు.

అవును.. ఇద్దరు మగపిల్లలు.. ఒక ఆడపిల్ల ఉన్న నారాయణకు అరవయ్యేళ్లపైనే ఉంటుంది.. అప్పట్లో చిట్టివలస జూట్ మిల్లులో పని చేశాడట.. అది మూసేసాక ఇక వేరే పనేం లేక.. ఆనందపురం దగ్గర్లోని తాళ్ల వలసలో ఊరకనే ఇంట్లో ఉండడం ఎందుకని కూరగాయలు.. ఆకుకూరలు, పూలు.. మార్కెట్లో కొనుక్కుని మళ్ళా మారు అమ్మకానికి మోపెడ్ మీద తిరుగుతాడు. రోజూ దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు  తిరుగుతాడు.

పెద్దగా తెలివితేటలు లేవు .. ఎక్కువ రేటు చెప్పడు.. మార్కెట్ రేటుకు మరి కాసింత పైన వేసుకుని అమ్ముతాడు.. ఇదేంటి నారాయణ ఇంత అమాయకుడివి.. తెలివి లేదు ఎలా బతుకుతావు అంటే.. పల్లకుందూ ఎవడినైనా ముంచాలంటే తెలివుండాలి గానీ.. మామ్మూలుగా బతకడానికి తెలివెందుకు.. మనం కొన్న సరుకుమీద కేజీకి ఐదో పదో వస్తే చాల్లే.. నాకెందుకు తెలివి.. మేడలు కట్టాలా.. మిద్దెలు కట్టాలా అంటాడు..  అవునులే.. బతకడానికి తెలివి అక్కర్లేదు.. రెక్కలకష్టం చాలు.. ఎవరినో మోసం చేయాలంటే తెలివి ఉండాలి.. అనేశాను.

నారాయణతో వాదించలేం.. తెలివి లేదంటాడు.. కొత్త లాజిక్కులు తీస్తాడు.. నారాయణ ఇద్దరు కొడుకులూ మేస్త్రీలే.. రోజూ పని.. డబ్బులు ఉంటాయి.. ఇద్దరి బతుకులకు ఎక్కడా సమస్య లేదు.. ఆడపిల్లను కూడా దగ్గిరోళ్లకే ఇచ్చాను.. దాని బతుక్కి పర్లేదు.. అల్లుడు మంచోడే.. పండక్కి కూతురికి మూడువేల ఇచ్చాను.. నా కొడుకులు కూడా తలా వెయ్యేసి ఇచ్చారు.. మొత్తం ఐదువేలు.. దానికి దాని పిల్లలకు గుడ్డముక్కలకు సరిపోతాయి.. ఇంకేటి కావాలి చెప్మి అంటాడు.. అంత దిలాసాగా ఉన్నవాడితో మనం నెగ్గుకురాలేం.. అవును నారాయణ జీవితానికి ఇంకేటి కావాలి అన్నాను.  

పిల్లలు బాగున్నారు కదా మరి నువ్వెందుకు తిరగడం అంటే.. మా బాగా చెప్పినావ్.. మన బతుకు మనది.. నేను మా ముసల్ది .. నా జీవితం వేరే..  పిల్లలతో మనకెందుకు.. ఒంట్లో సత్తువున్నంత వరకు మనం పంజేయాలా. పైసా తెచ్చుకోవాలా.. మనం ఆళ్ళమీద చెరబడ్డం ఎందుకు..  నాకసలు అలాంటివి నచ్చదు.. రోజూ ఇలాగే తిరుగుతా నాకు మా ఇంటిదానికి సరిపోతాయి.. ఇంకా వందా యాభై మిగిలితే మానవరాళ్లకు గట్రా ఇస్తుంటా అంటాడు.. యేటి మరి పండక్కి బట్టలు కొన్నావా అంటే.. ఆ.. రెండు కొత్త నిక్కర్లు.. చొక్కా కొన్నా అన్నాడు మెరుస్తున్న కళ్ళతో.. మరేటి ఐతే కనుమకు ఏర్పాట్లు అంటే.. ఉంటుందిలే.. ముక్కలు గట్రా.. ఉండవేటి మరి.. అన్నీ ఉంటాయి.

కనుమంటే కనుమే అంటాడు.. మరి కనుమకు మా ఇంటికి వచ్చేరాదూ నారాయణా అంటే.. గొప్పగ చెప్పినావ్.. మనవళ్లు.. మనవరాళ్లు కొడుకులు.. కోడళ్ళు.. ఓస్.. ఎంతమంది ఉన్నారనుకున్నావ్.. మా ఇల్లే పెద్ద జాతర తెలుసా.. నువ్వే మా ఇంటికి వచ్చిద్దు.. మంచి మాంసం కూర వండుకుందుము అని ఎదురు ఆహ్వానిస్తాడు.. అప్పుడంతే జగనన్న ఉన్నప్పుడు పండుక్కి ఏదో పధకం డబ్బులొచ్చేవి.. పండుగ గడిసిపోయేది.. ఇప్పుడవేటి లేవు.. ఇంట్లో పైసా లేదు. జనాల దగ్గర డబ్బుల్లేవు.. మనమే ఏదో చేసి తెచ్చుకోవాలి.. అంటూ ఎకనామిక్స్ మొదలెట్టాడు.. ఆ ఓహో అన్నాను. సర్లే.. నీతోటి మాట్లాడుకుని కూకుంటే నా యాపారం లాసైపోద్ది .. ఎల్తాను.. మళ్ళా పండుగ.. కనుమల తరువాత వస్తాను.. అంటూ కూరగాయల సంచితో బయల్దేరాడు..
-సిమ్మాదిరప్పన్న. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)