Breaking News

బాబు బాటలోనే భువనేశ్వరి 

Published on Tue, 09/26/2023 - 05:17

సాక్షి, అమరావతి: కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ప్రయాణిస్తున్నారు. సోమవా­రం కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి తొలిసారిగా రాజ­కీయ ప్రసంగం చేస్తూ అబద్ధాలను అలవోకగా వల్లెవేశారు.

స్కిల్‌ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు అమాంతంగా తమ హెరిటేజ్‌ కంపెనీ విలువను పెంచేశారు. రూ.371 కోట్ల కోసం తాము కక్కుర్తి పడ¯నక్కర్లేదని, హెరిటేజ్‌లో రెండు శాతం వాటా అమ్ముకుంటే తమకు రూ.400 కోట్లు వస్తాయంటూ కార్యకర్తలను నమ్మించే ప్రయత్నం చేశారు. రెండు శాతానికి రూ.400 కోట్లు అంటే హెరిటేజ్‌ కంపెనీ విలువ రూ.20,000 కోట్లుగా ఉండాలి.

కానీ సోమవారం స్టాక్‌ మార్కెట్‌ గణాంకాల ప్రకారం హెరిటేజ్‌ మార్కెట్‌ క్యాప్‌ అంటే కంపెనీ మొత్తం విలువ రూ.2,171 కోట్లు మాత్రమే. ఈ ప్రకారం చూస్తే రెండు శాతం వాటా విక్రయిస్తే భువనేశ్వరి చేతికి వచ్చేది కేవలం రూ.43.2 కోట్లు మాత్రమే. మరి రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయంటూ ఎలా చెప్పారంటూ స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

మా కంపెనీలో 2% వాటా అమ్మినా రూ.400 కోట్లు వస్తాయ్‌..
జగ్గంపేట/అన్నవరం: మా కంపెనీ(హెరిటేజ్‌)­లో 2 శాతం వాటా అమ్మినా రూ.400 కోట్లు వస్తాయని.. బినామి కంపెనీ పేరుతో చంద్ర­బాబు కోట్లాది రూపాయలు కాజేశారన్న ఆరోప­ణల్లో నిజం లేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు అరె­స్టుకు నిరసగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరు­గు­తున్న నిరాహర దీక్షల శిబిరాన్ని ఆమె సోమ­వా­రం సందర్శించారు. శిబిరంలో పాల్గొని సంఘీ­భావం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లా­డుతూ ప్రజల సొమ్ము తమకు వద్దని.. తమ కుటు­­ంబం ప్రజా సేవకే అంకితమైందని, తన భర్త చంద్రబాబు ఏ తప్పు చేయలేదని.. అయినా జైల్లో పెట్టారని చెప్పారు. ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఓట్లు పోకుండా కాపాడుకో­వాలని సూచించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్య­క్రమాన్ని ఆమె ప్రారంభించారు.

అనంతరం జగ్గంపేటలో జ్యోతు­ల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతి సోమ­వారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, నారా భువ­నేశ్వరి రత్న­గిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. చంద్ర­బాబు వెంటనే జైలు నుంచి విడుదలవ్వాలని పూజలు చేశారు. వేదపండితులు ఆమెకు ఆశీస్సులు అంద­జేశారు. ఆమె వెంట పార్టీ నేతలు యనమల రామ­కృష్ణుడు, వరుపుల సత్యప్రభ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు­న్నారు. 

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)