Breaking News

ప్రేమఖైదీ.. పాకిస్తాన్‌ వ్యక్తితో నంద్యాల మహిళ ప్రేమ పెళ్లి  

Published on Mon, 07/24/2023 - 13:50

సాక్షి, గడివేముల: నంద్యాల జిల్లా మహిళను ప్రేమించిన ఓ పాకిస్తాన్‌ పౌరుడు ఆమె కోసం దేశంలోకి అక్రమంగా వచ్చాడు. ఆపై ఇక్కడ ప్రేమౖ‘ఖెదీ’గా మారాడు. వివరాల్లోకి వెళ్తే... పాకిస్తాన్‌లోని సియాకోట్‌ జిల్లా కుల్లులార్‌ గ్రామానికి చెందిన గుల్జార్‌ఖాన్‌కు 2008లో రాంగ్‌ కాల్‌ ద్వారా నంద్యాల జిల్లా గడివేములకు చెందిన దౌలత్‌బీతో పరిచయం ఏర్పడింది. 
అప్పటికే దౌలత్‌బీకి భర్త చనిపోయాడు. ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

అయినప్పటికీ గుల్జార్‌ తాను ప్రేమించిన దౌలత్‌బీ కోసం 2011లో తాను పనిచేస్తున్న సౌదీ అరేబియా నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. గడివేములకు చేరుకుని 2011, జనవరి 25న కర్నూలులో దౌలత్‌బీని వివాహం చేసుకున్నాడు. సమీప గ్రామాల్లో పెయింటింగ్‌ పనులు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు జని్మంచారు. గుల్జార్, అతని భార్య, పిల్లలకు గడివేములలోనే ఆధార్‌ కార్డులు పొందారు. వాటి ఆధారంగా తనతోపాటు భార్య, ఐదుగురు పిల్లలను సౌదీ అరేబియాకు తీసుకువెళ్లేందుకు వీసా తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లాలని ప్రణాళిక రూపొందించుకున్నారు.

ఈ మేరకు 2019లో సౌదీ వెళ్లేందుకు గడివేముల నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకోగా, అక్కడ పోలీసులు గుల్జార్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆరు నెలలు అనంతరం విడుదల చేశారు. అప్పటి నుంచి గుల్జార్‌ గడివేములలోనే ఉంటున్నాడు. అయితే, 2022, ఫిబ్రవరి 9న మళ్లీ గుల్జార్‌ను అరెస్టు చేసి మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో దౌలత్‌బీ మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగి తన భర్తను కండీషన్‌ బెయిల్‌పై ఈ నెల 20న బయటకు తీసుకువచ్చింది. గడివేముల వచి్చన గుల్జార్‌ను ఆదివారం పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. ఈ నెల 27న హైదరాబాద్‌ కోర్టులో గుల్జార్‌ హాజరుకావాల్సి ఉందని దౌలత్‌బీ తెలిపింది.

ఇది కూడా చదవండి: ఇదో వింత ప్రేమ.. ఇద్దరు పిల్లలున్నా పాక్‌ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి.. 

Videos

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)