Breaking News

నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..

Published on Wed, 06/18/2025 - 16:13

సాక్షి, పల్నాడు: సత్యం ఊపందుకోకముందే ఒక అబద్ధం ప్రపంచవ్యాప్తంగా సగం దూరం ప్రయాణించగలదు. అలాంటి ప్రచారాలు ఎల్లో బ్యాచ్‌కు వెన్నతో పెట్టిన విద్య. మీడియా సంస్థలను, సోషల్‌ మీడియాను మేనేజ్‌ చేయగలిగే వాళ్లు.. ఇప్పుడు జగన్‌ పల్నాడు పర్యటన నేపథ్యంతోనూ తప్పుడు రాతలు, ప్రచారాలతో చెలరేగిపోతున్నారు. 

ఏడాది కిందట.. పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో నాగమల్లేశ్వరరావు అనే వైఎస్సార్‌సీపీ నేత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. బాధితుడి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటనకు సిద్ధమయ్యారు. అంతే.. పచ్చదండు విషపు రాతలతో రెచ్చిపోసాగింది. బెట్టింగ్‌ యాప్‌ వల్ల చనిపోయాడంటూ సైకో ప్రచారం కొనసాగించింది. ఇది రెంటపాళ్ల గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఆనాడు ఏ జరిగిందంటే.. 

2024 జూన్‌ 4న.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నాగమల్లేశ్వరరావు ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. ఆ కాసేపటికే ఆయన్ని స్థానిక పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలా.. జూన్‌ 5 రాత్రి 10గంటల వరకు పోలీసులు నిర్భంధించారు. అయితే స్టేషన్‌లో ఏం జరిగిందంటే..  

‘‘మన ఇంటిపై దాడి చేస్తున్నారు నాన్నా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాగమల్లేశ్వరరావుకు ఆయన కుమార్తె ఫోన్‌ చేశారు. కుమార్తెతో మాట్లాడుతుండగా ఫోన్‌ లాక్కుని.. నాగమల్లేశ్వరరావును పోలీసులు దుర్భాషలాడారు. గ్రామంలోకి వెళ్ల కూడదని బెదిరించారు. ఒకవేళ తమను కాదని గ్రామంలోకి వెళ్తే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది..  గ్రామంలో ఉండకూడదు’’ అని నాగమల్లేశ్వరరావును పోలీసులు భయపెట్టారు. గ్రామంలో ఉంటే కాల్చేస్తామని బెదిరింపులకు దిగారు. ఆపై జైలు నుంచి బయటకు వచ్చిన నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. తనను పోలీస్‌ స్టేషన్‌లో తీవ్రంగా అవమానించి.. కొట్టారంటూ తండ్రికి ఫోన్‌ చేసి వాపోయారు. ఇలా రెడ్‌బుక్‌ పాలనలో భాగంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైన వైఎస్సార్‌సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు కావడం గమనార్హం. 

ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్‌ జగన్‌  రెంటపాళ్ల గ్రామాన్ని వెళ్లారు. మరోవైపు.. ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగంతో అన్నివిధాల ప్రయత్నించిన కూటమి ప్రభుత్వం.. చివరకు ఇలా ‘బెట్టింగ్‌ యాప్‌ వల్ల చనిపోయాడంటూ’’ ఐటీడీపీ అండ్‌ కో ద్వారా విషప్రచారానికి దిగజారిపోయింది.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)