Breaking News

వ్యవసాయ కుటుంబాల.. భూపరిమాణం తగ్గుతోంది

Published on Sun, 11/10/2024 - 05:53

సాక్షి, అమరావతి: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు భూమి పరిమాణం ఏటా తగ్గిపోతోంది. 2016–17లో ఇది 1.1 హెక్టార్లుండగా 2021–22లో అది 0.7కు పడిపోయింది. ఈ విషయాన్ని నాబార్డ్‌ ఆలిండియా రూరల్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ సర్వే 2021–22 వెల్లడించింది. వ్యవసాయ గృహాల సాగు సామర్థ్యం, ఉత్పత్తి భూమి పరిమాణం గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో దేశంలోను వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు భూమి పరిమాణాన్ని ఐదు తరగతులుగా వర్గీకరించినట్లు సర్వే వెల్లడించింది. ఇక దేశంలో 38 శాతం కుటుంబాలకు 0.4 హెక్టార్లలోపే భూమి ఉంది.

33 శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.41 హెక్టార్ల నుంచి 1.0 హెక్టార్‌ వరకు ఉంది. 15 శాతం వ్యవసాయ కుటుంబాలకు 1.01 హెక్టార్ల నుంచి 2.0 హెక్టార్ల వరకు భూమి ఉంది. 8 శాతం కుటుంబాలకు 2.1 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంది. ఆరు శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.01 హెక్టార్లలోపే భూమి ఉంది. ఇలా దేశంలోని వ్యవసాయ కుటుంబాలు కలిగి ఉన్న సగటు భూమి పరిమాణం రాష్ట్రాల మధ్య విస్తృత వైవిధ్యాలు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోందని సర్వే పేర్కొంది.   

ఎనిమిది రాష్ట్రాల్లో ఒక హెక్టారు కన్నా ఎక్కువ.. 
దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబానికి సగటు భూమి ఒక హెక్టార్‌ కన్నా ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. మహారాష్ట్ర, నాగాలాండ్, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో ఒక హెక్టార్‌ కన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నట్లు పేర్కొంది. మరో పది రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాలకు సగటు భూ­మి 0.4 హెక్టార్లలోపే ఉందని నివేదిక తెలిపింది. అసోం, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో చిన్న భూ పరిమాణమే ఉందని సర్వే స్పష్టం చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)