Breaking News

ఏపీ సర్కార్‌ ఇఫ్తార్‌ విందు మాకొద్దు!

Published on Wed, 03/26/2025 - 16:24

సాక్షి, విజయవాడ: వక్ఫ్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపు(గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని చేయాలని నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్‌ను బాయ్ కాట్ చేస్తున్నామని.. రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్‌ను బాయ్ కాట్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ‘‘సనాతనధర్మం బోర్డులో ఇతర మతాలను కలపాలని చూస్తే మొదటగా పోరాడేది మేమే. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం.

..వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన ఇది. మతపరమైన నిర్వహణ ఆయా మతాలే చూసుకుంటాయి. బిల్లులో పారదర్శకత లేదు. ముస్లింలపై జరుగుతున్న కుట్ర ఇది’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పేర్కొంది.

‘‘వక్ఫ్ సవరణ బిల్లు కుట్రపూరితంగా చేస్తున్నారు. ప్రతీ మతానికి వారికి సంబంధించిన భూములను రక్షించుకునేందుకు బోర్డులు ఉన్నాయి. ముస్లింలకు మాత్రమే బోర్డు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదు. భవిష్యత్తులో అన్నిమతాలకు ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతాయి. ఈ నెల 29న విజయవాడ ధర్నాచౌక్‌లో భారీ నిరసన చేపడతాం’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలిపారు.

అన్ని ముస్లిం సంఘాలు ఇఫ్తార్ విందును బహిష్కరించాలి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)