YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు
Breaking News
మీడియాకు ముద్రగడ కుమారుల లేఖ
Published on Thu, 07/16/2026 - 21:11
సాక్షి,కీర్లంపూడి: కాపు ఉద్యమ నేత, దివంగత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమారులు బాలు, గిరిబాబులు మీడియాకు లేఖ రాశారు. ‘వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి ముద్రగడ నిలువుటద్దం. ఆయన మరణాంతరం ఏం చేయాలనే దానిపై.. ఆయన మాకు చాలా స్పష్టంగా చెప్పారు. ముద్రగడ నిర్ణయం మేరకే అంత్యక్రియల ప్రక్రియ నడిచింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు వద్దని చెప్పారు.
ఆయన నిర్ణయం మేరకు అధికారిక లాంఛనాలను తిరస్కరించాం. ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి.. ముద్రగడపై అపార గౌరవాన్ని చాటిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
‘మాకు, బార్లపూడి క్రాంతి కుటుంబానికి మధ్య.. కొన్నేళ్లుగా సంబంధాలు, రాకపోకలు లేవు. ఆమె కడచూపుకు రాకూడదన్న నిర్ణయం ముద్రగడదే. మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేసే కథనాలు.. ప్రసారం చేయొద్దని మీడియాను వేడుకుంటున్నాం’అని లేఖలో పేర్కొన్నారు.
Tags : 1