Breaking News

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎంపీ గురుమూర్తి లేఖ

Published on Sun, 12/07/2025 - 17:29

ఢిల్లీ: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరక కేంద్ర విద్యాశాఖ, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. విద్యార్థినిలపై లెక్చరర్ల లైంగిక వేధింపుల అంశంలో జోక్యం చేసుకోవాలని విన్నవించారు.  

‘సంస్కృత విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయంలో బీఈడీ మొదటి సంవత్సరం విద్యార్థినిపై లెక్చరర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ విద్యార్థినిపై తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఆమె చదువు మధ్యలోనే వదిలి వెళ్ళిపోయింది. ఈ అంశం నేపథ్యంలో బాధితురాలి ప్రాణాలకు హాని ఏర్పడింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి ,  కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితురాలు చదువు కొనసాగించేందుకు తగిన  సురక్షిత వాతావరణం కల్పించాలి’ అని పేర్కొన్నారు.

కాగా, విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్‌ లక్ష్మణ్‌ కుమార్‌ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తన మొబైల్‌లో రికార్డు చేశాడు.

అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్‌ లక్ష్మణ్‌ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్‌ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)