Breaking News

సార్‌ .. నా కూతురిని నేను పోషించలేను..

Published on Tue, 04/29/2025 - 13:53

అనంతపురం: సార్‌ .. నా కూతురిని నేను పోషించలేను. మీరే నా కూతురికి ఒక మంచి జీవితం ఇవ్వాలని కోరుతున్నా. మీ దగ్గరే వదిలి వెళ్లిపోతున్నాను. తన జీవితం బాగుండాలని వేడుకుంటున్నాను. నేను చనిపోతున్నా. నా కూతురిని బాగా చూసుకోండి ప్లీజ్‌. ఒక తల్లిగా ఇది నా ఆవేదన’ అంటూ లెటర్‌ రాసిన ఓ తల్లి వారం వయస్సు కలిగిన ఆడ శిశువును అనాథగా వదిలి వెళ్లిపోయింది. ఈ సంఘటన అనంతపురంలోని విజయనగర్‌ కాలనీలో సోమవారం రాత్రి 10 గంటలకు వెలుగులోకి వచ్చింది. 

నవజాత శిశువుకు గౌను వేసి చూడముచ్చటగా తీర్చిదిద్దిన తల్లి బిడ్డను అనాథగా వదిలివెళ్లడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. శిశువు ఏడుపు విని అటువైపు వెళ్తున్న వారు గమనించి ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించారు. ఐసీపీఎస్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ చంద్రకళ, చైల్డ్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ కృష్ణమాచారి, సూపర్‌వైజర్‌ నవీన్‌, ఆశా వర్కర్‌ గౌరి ఘటనా స్థలానికి వెళ్లారు. శిశువును అక్కున చేర్చుకొని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడి నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ పసికందు తల్లి తన ఆవేదనను లేఖలో రాసి అక్కడ ఉంచడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)