Breaking News

జననీ.. జన్మధన్యం

Published on Mon, 05/05/2025 - 11:00

తిరుపతి సిటీ:  చిన్నప్పుడు అమ్మ కొంగుపట్టుకుని తిరుగుతాం. పెద్దయ్యాక ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే మనసు రాదు. వృద్ధులైన తల్లిదండ్రులను భారంగా భావిస్తున్న రోజులివీ.. ఈనాటి రోజుల్లోనూ తల్లిని అమితంగా ప్రేమించే తనయులు ఉన్నారంటే అతిశయోక్తికాదు. ఈ కోవకు చెందిన వారే మైసూరుకు చెందిన దక్షిణామూర్తి కృష్ణకుమార్‌. 

ఆయనో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. 75 ఏళ్ల తల్లి రత్నమ్మ కోరికను తీర్చేందుకు టీమ్‌లీడర్‌ స్థాయి ఉద్యోగాన్ని నెలకు రూ.1.60 లక్షల వేతనం వస్తున్నా త్రుణప్రాయంగా వదిలేశారు. అమ్మతో కలిసి 2018 జనవరి 16న పుణ్యక్షేత్రాల యాత్ర చేపట్టారు. ద్విచక్రవాహనంపైనే సుమారు 98,152 కిలోమీటర్లు అమ్మతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర సాగించారు. లక్షకుపైగా పుణ్యక్షేత్రాలు సందర్శించారు. ఆదివారం సాయంత్రం తిరుపతి కోదండరామస్వామి దేవస్థాన సమీపంలోని శృంగేరి మఠానికి చేరుకున్నారు.

 ఈ సందర్భంగా కృష్ణకుమార్‌ తన యాత్ర విశేషాలు పంచుకున్నారు. దేశంతోపాటు భూటాన్, మయన్మార్, నేపాల్‌ దేశాల్లోని పుణ్యక్షేత్రాలనూ సందర్శించినట్టు చెప్పారు. మరో పదిరోజుల్లో స్వస్థలానికి చేరకుంటామని, ఇక ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండి తల్లికి సేవ చేసుకుంటానని వెల్లడించారు. మరో జన్మంటూ ఉంటే కృష్ణకుమార్‌ తల్లిగానే పుట్టాలని ఉందని రత్నమ్మ తన గుండెల్లో నుంచి పొంగుకొస్తున్న సంతోషాన్ని ఆనందబాష్పాలతో పంచుకోవడం విశేషం.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)