Breaking News

ఏపీలో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ పరార్‌.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్‌

Published on Tue, 09/23/2025 - 11:38

సాక్షి, తూర్పుగోదావరి/ఎన్టీఆర్‌ జిల్లా: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి వాయిదా కోసం విజయవాడ తీసుకువెళ్లి తిరిగి తీసుకువస్తుండగా మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ సోమవారం రాత్రి 7.30గంటలకు దేవరపల్లి మండల దుద్దుకూరు వద్ద పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. దొంగతనం కేసులో నిందితుడు అయిన ఇతను పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్‌ కప్స్, వైట్‌ కలర్‌ టీ షర్ట్, బ్లాక్‌ కలర్‌ ట్రాక్‌ ప్యాంటు ధరించి ఉన్నాడని దేవరపల్లి ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.పై

ముద్దాయి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే  94407 96584 (ఇన్‌స్పెక్టర్‌ దేవరపల్లి), 94407 96624 (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవరపల్లి) ఫోన్‌ నంబర్లకు తెలియజేయాలని కోరారు. ముద్దాయి ఆచూకీ లేదా సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని తెలిపారు. బత్తుల ప్రభాకర్‌ కోసం 10 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడిన నిందితుడి ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 42, తమిళనాడు, కర్ణాటక, కేరళలో 44 కేసులు నమోదయ్యాయి.

గత ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో పోలీసులపై ప్రభాకర్‌ కాల్పులు జరిపాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీపై ఎన్టీఆర్‌ జిల్లా సీపీ సీరియస్ అయ్యారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి తీసుకొని వెళ్తున్న క్రమంలో దుద్దుకురు వద్ద పోలీసుల కళ్లు గప్పి బత్తుల ప్రభాకర్‌ పరారయ్యాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఏ. ఆర్ హెడ్ కానిస్టేబుళ్లపై వేటు పడింది. సుగుణకరరావు, షడ్రక్‌లను సస్పెండ్ చేస్తూ సీపీ రాజశేఖర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)