Breaking News

మాక్‌ పోలింగ్‌ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం

Published on Wed, 08/21/2024 - 05:26

సాక్షి, అమరావతి : ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించడం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీలు, పరిశీలన స్థానంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన టీ–ఎస్‌వోపీ సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణ జరిపారు. 

బాలినేని తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ దాదాపు అరపూట వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు తీర్పు ఉద్దేశం, ప్రధాన సారాంశం, దానికి ఈసీఐ ఏ విధంగా వక్ర భాష్యం చెబుతోందో వివరించారు. మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన చేయకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం నెరవేరదని అన్నారు. మాక్‌ పోలింగ్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు మాత్రమే తెలుస్తుందని తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పరిశీలన వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. 

వాటి పరిశీలన వల్ల ఓడిపోయిన అభ్యర్థులకు ఓట్ల గురించి తెలుసుకునే అవకాశం, ఈవీఎంల ట్యాంపరింగ్‌ బయటపడే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకే సుప్రీం కోర్టు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత 45 రోజుల వరకు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను భద్రపరచాలని ఆదేశించిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1 ఈవీఎం, వీవీ ప్యాట్‌ను ఎన్నికల సంఘం భౌతికంగా పరిశీలించేదని, నారా చంద్రబాబు నాయుడు 2019లో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు ఆ సంఖ్య 5కు పెంచిందని వివరించారు. 

పోలింగ్‌ సమయంలో ఓట్ల గురించి తెలుసుకునేందుకే ఈవీఎంలు, వీవీ ప్యాట్లు పరిశీలన చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. అంతే తప్ప అప్పటి ఓట్లను పక్కన పెట్టేసి ఇప్పుడు మాక్‌ పోలింగ్‌ నిర్వహించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని స్పష్టంచేశారు. ఎన్నికల సంఘం చిత్తశుద్దిని తాము ప్రశ్నించడం లేదని, దాని వ్యవహారశైలిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని శ్రీరామ్‌ చెప్పారు. ఈ వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ తోసిపుచ్చారు. సుప్రీం కోర్టు తీర్పును పిటిషనర్‌ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. 

ఈవీఎం, వీవీ ప్యాట్ల లెక్కింపు సాధ్యం కాదన్నారు. ఒకవేళ ఇదే సుప్రీం కోర్టు ఉద్దేశం అయి ఉంటే నేరుగా చెప్పేదే తప్ప, బరŠట్న్‌ మెమొరీ (ఈవీఎం మైక్రో కంట్రోలర్‌లో శాశ్వతంగా నిక్షిప్తం చేసిన మెమొరీ) గురించి మాట్లాడేది కాదన్నారు. బరŠట్న్‌ మెమొరీని మాత్రమే పరిశీలించమని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. అందుకే ఆ బాధ్యతలను ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్లకు అప్పగించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి  కోర్టు సమయం ముగియడంతో విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)