Breaking News

ఎమ్మెల్యేకే రూమ్‌ ఇవ్వరా.. నీకెంత ధైర్యంరా..?

Published on Thu, 05/08/2025 - 12:46

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఎమ్మెల్యే మనుషులొస్తే రూములు లేవంటారా.. ఎంత ధైర్యం మీకు.. ఇకపై మీరు హోటల్‌ ఎలా నడుపుతారో చూస్తాం’ అంటూ అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అనుచరులు వీరంగం చేశారు. ఈ ఘటనకు      సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ తన అనుచరులతో మాట్లాడుకోవడానికి సూట్‌రూమ్‌ కావాలని తన ముఖ్య అనుచరుడిని నగరంలోని అలెగ్జాండర్‌ హోటల్‌కు పంపించారు. అయితే హోటల్‌ మేనేజర్‌ రూములు ఖాళీగా లేవని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే అనుచరులు పరుష పదజాలంతో మేనేజర్‌పై విరుచుకుపడ్డారు. మెడపట్టి గెంటినట్టు బాధిత సిబ్బంది చెప్పారు.

 ఇవన్నీ సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. గొడవ సమయంలో హోటల్‌లో ఎమ్మెల్యే అనుచరులు గంగారాం, పి.హరిక్రిష్ణ ఉన్నట్టు సీసీ ఫుటేజీల్లో తేలింది. ఆ సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి హోటల్‌ బయట కారులోనే ఉన్నారు. మేనేజర్‌ను కారులో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లగా.. ఎమ్మెల్యే సైతం తీవ్ర పదజాలంతో దూషించినట్టు బాధితులు చెబుతున్నారు. ‘ఎమ్మెల్యే అడిగితే సూట్‌రూం ఇవ్వవా.. నీకెంత ధైర్యంరా.. ఏమనుకుంటున్నావ్‌ నా గురించి’ అంటూ తిట్టడమే కాకుండా ఇకపై హోటల్‌ ఎలా నడుపుకుంటారో చూస్తా అంటూ బెదిరించినట్లు  తెలిసింది. నాలుగేళ్ల పాటు సూట్‌రూమ్‌ ఫ్రీగా ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం.  

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు రంగంలోకి.. 
పోలీసుల సోదాలు ముగిసిన తర్వాత ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఎమ్మెల్యే నుంచి ఫోన్‌ వెళ్లింది. దీంతో ముగ్గురు ఆ శాఖ అధికారులు హోటల్‌లో సోదాలకు వెళ్లారు. కిచెన్‌లో ఆహార పదార్థాలను పరిశీలించారు. చికెన్‌ నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ల్యాబుకు పంపిస్తున్నట్టు ఓ అధికారి పేర్కొన్నారు. ఇక.. మరుసటి రోజు అంటే బుధవారం ఉదయాన్నే మున్సిపల్‌ అధికారులను ఎమ్మెల్యే ఉసిగొలి్పనట్లు తెలిసింది. హోటల్‌ భవన నిర్మాణం అక్రమంగా ఉందని, తనిఖీలకు వెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో లిక్కర్‌ వ్యాపారి (సింధూర వైన్స్‌) పిట్టు రామలింగారెడ్డిపై కూడా దగ్గుపాటి ప్రసాద్‌ దాడికి యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి.  

పది నిమిషాల్లోనే పోలీసుల రైడింగ్‌
ఈ ఘటన జరిగిన పది నిమిషాల్లోనే ఎమ్మెల్యే.. టూటౌన్‌ సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌కు ఫోన్‌ చేసి హోటల్‌పై రైడ్‌ చేయాలని ఆదేశించడంతో ఒక్కసారిగా పోలీసులు హోటల్‌కు చేరుకున్నారు. ప్రతి రూము గాలించారు. చిన్న తప్పు కనిపించినా కేసు బుక్‌ చేయాలని శతవిధాలా యతి్నంచారు. అయితే, చివరకు ఏ లోపం కనిపించకపోవడంతో పోలీసులు ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పారు. తొలుత హోటల్‌లో రైడ్‌ చేయలేదని చెప్పిన సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌.. మళ్లీ కొద్ది సేపటికే అన్ని హోటళ్లలాగే ఇక్కడ చేశామని ‘సాక్షి’తో చెప్పడం 
గమనార్హం.  

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)