Breaking News

సోషల్‌ మీడియా కట్టడికి మంత్రుల కమిటీ

Published on Thu, 10/02/2025 - 05:45

సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తే సహించలేని స్థితిలో ఉన్న సీఎం చంద్రబాబు దానిని కట్టడి చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని సిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

మానవ వనరులు, ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫ­రాలు, సమాచార శాఖ, హోం శాఖ మంత్రులతో కూడిన బృందాన్ని కమిటీగా ఏర్పాటు చేశారు. కమిటీ కార్యక­లాపాలను సమన్వయం చేయడానికి సమాచార శాఖ డైరెక్టర్‌ ఈ బృందానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీ ఎవరైనా నిపుణుల సహాయం తీసుకోవచ్చు.

మంత్రుల బృందం బాధ్యతలివీ
» దేశంలోని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు వర్తించే ప్రస్తుత చట్టాలు, నియమాలు, మార్గద­ర్శకాలను సమీక్షించాలి.
»  జవాబుదారీతనం, సమ్మతి అమలులో అంతరాలను గుర్తించాలి.
»  అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలి. పారదర్శకత ప్రమాణాలు, ప్లాట్‌­ఫా­మ్‌ బాధ్యతలు, వినియోగదారుల రక్షణ చర్య­లతో సహా సోషల్‌ మీడియా జవాబు­దారీత­నానికి ప్రపంచ విధానాలను విశ్లేషించాలి.
»  హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, ఆన్‌లైన్‌ దుర్వినియోగం, జాతీయ భద్రతకు ముప్పు తదితర అంశాలకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేయాలి.
» ఫిర్యాదుల పరిష్కారం, నివేదించే విధానాలపై స్పష్టమైన బాధ్యతలను సూచించాలి. పౌర హక్కులను కాపాడటంపై సలహా ఇవ్వాలి.
»  నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్‌ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలను సృష్టించడం లేదా బలోపేతం కోసం సిఫార్సు చేయాలి. 
»  నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మంత్రుల బృందం తమ సిఫార్సులను ప్రభుత్వానికి త్వరగా సమర్పించాలి.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)