Breaking News

కృష్ణా జలాలపై సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు సరికాదు: అంబటి

Published on Tue, 02/13/2024 - 21:32

సాక్షి, విజయవాడ: కృష్ణా జలాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం..పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. మంగళవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతారు.

‘నాగార్జుసాగర్ ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాలకి సగం సగంగా ఉంది. ప్రాజెక్టులు అప్పగించమని అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతవరకు ధర్మం. విభజన చట్టాన్ని అంగీకరించి.. ఒక సెక్షన్ మాత్రం అంగీకరించం అంటే ఎలా?. ఏపీ కూడా విభజన చట్టాన్ని అంగీకరించం అంటే కుదురుతుందా. విభజన సమయంలో నదీజలాల‌ పంపిణీపై చట్టంలో పొందుపరిచారు. విభజన చట్టం అంగీకరించమని చెప్పడం మొండివాదన. తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్డు కూడా మాకు అవసరం లేదు.

...ఆంధ్రా, రాయలసీమకి కేటాయించిన నీటి జలాలపైనే మా సీఎం వైఎస్‌ జగన్‌ చట్టబద్దంగా తీసుకెళ్లడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కేఆర్‌ఎంబీని విభజన చట్టంలో పొందుపరిచారు. టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు వివాదాలు ఉండవచ్చు. కృష్ణా జలాల పంపకాలు ఇప్పటివి కాదు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించింది. ఒకసారి అవార్డు అయిన అంశాలని వివాదం ఎలా చేస్తారు.. చట్టాన్ని గౌరవించాలి. హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వాదనలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)