Breaking News

కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ఆళ్ల నాని

Published on Fri, 05/14/2021 - 11:01

సాక్షి, విశాఖపట్నం: షీలానగర్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ప్రారంభించారు. సీఎం వైఎస్‌ జగన్ ఆదేశాలతో 300 ఆక్సిజన్‌ బెడ్లు కలిగిన కోవిడ్ కేర్ సెంటర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాటు చేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌: మంత్రి ఆళ్ల నాని 
30 మంది వైద్యులు, 90 మంది నర్సులతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రగతి భారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం అని అభినందించారు. ప్రస్తుత పరిస్థితిలో ఆక్సిజన్‌ అవసరం చాలా ఉందని.. ఆక్సిజన్‌ సరఫరాకి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఆస్పత్రుల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ప్రతి బెడ్‌కు ఒక్కో సిలిండర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.  కోవిడ్‌ కేర్‌ సెంటర్‌..

అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు: ఎంపీ విజయసాయిరెడ్డి
ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ప్రభుత్వం వైద్యం అందిస్తోందని.. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఆక్సిజన్ వైఫల్యం వల్ల కోవిడ్‌ బాధితులు ఇబ్బంది పడకూడదన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కోవిడ్‌ బాధితులకు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో పెషెంట్ల అటెండెన్స్‌ డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అన్ని రక్షణ చర్యలు ఏర్పాటు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’
YS Jagan: సీఎం జగన్‌ లేఖతోనే కదలిక  

Videos

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)