Breaking News

రామోజీ.. నీ నీచపు రాతలు చూస్తే జాలేస్తోంది

Published on Sat, 01/20/2024 - 05:21

సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరిస్తుంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అధిపతులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ వేడుకపై విషం చిమ్ముతూ శుక్రవారం ఈనాడు పత్రిక కథనం ప్రచురించడంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈనాడు పేపర్‌ను చించివేసి, పత్రిక ప్రతులను కాల్చివేశారు.

ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. దళితుల భూములను ఆక్రమించి ఫిల్మ్‌ సిటీ కట్టుకున్న నీచుడు రామోజీరావని ధ్వజమెత్తారు. దుర్మార్గుడైన రామోజీరావు దళిత బంధువైన సీఎం వైఎస్‌ జగన్‌పై విషం చిమ్మటం గర్హనీయమన్నారు. రామోజీరావు ఈనాడు పేపర్‌ను చంద్రబాబుకు తాకట్టుపెట్టి, పత్రిక విలువలు మంటగలిపారన్నారు. ఆయన కులపోడు సీఎంగా లేడన్న కారణంతోనే రాష్ట్రంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్‌ జగన్‌పై ఈనాడులో రాసిన చెత్త రాతలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రామోజీ వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలికారు.

అంబేడ్కర్‌ విగ్రహం స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు చేస్తున్నా­రని తెలిసినప్పటి నుంచే పచ్చ మీడియా ఏడుపే ఏడుపు అని అన్నారు. సీఎం జగన్‌ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని చెప్పారు. దశాబ్దాలుగా దళితులను అణచివేసిన చంద్రబాబుకు రామోజీ ఒక బ్రోకర్‌ అని విమర్శించారు. ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. దళితులకు మేలు చేయటం అంటే రామోజీ, చంద్రబాబు, రాధాకృష్ణలకు నచ్చదని చెప్పారు. కాటికి కాలుచాచిన వయసులో కూడా రామోజీ విషం కక్కటం మానలేదని వ్యాఖ్యానించారు. దళితులు వారి ఇళ్లలో పాచి పనులు చేయటానికే బతకాలనేది రామోజీ, చంద్రబాబుల నైజమన్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేవారిలో దేశంలోనే సీఎం జగన్‌ ముందున్నారని  చెప్పారు. ఈ విగ్రహం సీఎం జగన్‌కి బడుగు బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమ, అభిమానాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇది తట్టుకోలేక రామోజీ, చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)