Breaking News

మెడికల్‌ కాలేజీ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

Published on Sat, 01/10/2026 - 12:03

కడప:  మెడికల్‌ కాలేజీ ఉద్యోగులపై మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం.   మెడికల్‌ కాలేజ్‌ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీకి బదిలీ చేసింది. .పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 సీట్లు రావడంతో పీపీపీ కింద ప్రైవేట్ పరం చేయనున్న కాలేజీల్లో ఉద్యోగుల బదిలీ చేస్తోంది ప్రభుత్వం. వారిని పొమ్మనలేక పొగబెట్టినట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని కాలేజీల నుంచి 600 మంది ఉద్యోగుల బదిలీ చేసింది. 

తక్కువ జీతంతో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు ఈ  బదిలీలు శరాఘాతంగా మారాయి.  మరొకవైపు 600 మంది ఉద్యోగుల బదిలీతో ప్రశ్నార్థకంగా మారింది ఆయా మెడికల్ కాలేజీల భవితవ్యం. వైఎస్ జగన్ హయాంలో వారి నియామకం జరిగిందనే అక్కసుతోనే ఈ బదిలీలు అనే విమర్శ వినిపిస్తోంది. 

ఆయా మెడికల్ కాలేజీల నుంచి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలు తరలింపు ఇప్పటికే జరిగిపోగా, ఇప్పుడు ఉద్యోగుల బదిలీ కార్యక్రమం చేపట్టింది కూటమి సర్కారు. 

పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, పలువురు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం బదిలీ చేస్తూ వస్తుంది. మరో వైపు పీపీపీ టెండర్లలో ఆయా మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు సంస్థలు  ముందుకు రాకపోగా, బదిలీలతో పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపురం మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)