Breaking News

బురదలోనే విద్యార్థులకు భోజనాలు

Published on Sun, 06/30/2024 - 03:08

విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న దుస్థితే మళ్లీ దాపురించింది. ఎన్నికల ముందు వరకు పాఠశాల భవనంలో ఫ్యాన్ల కింద మధ్యాహ్న భోజనాలు చేసిన విద్యార్థులు.. ఇప్పుడు బురదలో కూర్చొని తినాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విశాఖపట్నంలోని కప్పరాడ ప్రభుత్వ పాఠశాలలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. 

పాఠశాల విద్యార్థులను బురదలో కూర్చోబెట్టి మధ్యాహ్న భోజనాలు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా సర్కారు బడులను అభివృద్ధి చేసింది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలను కన్పించింది. రోజూ నిర్దిష్ట మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించింది. 

అయితే కూటమి ప్రభుత్వం వ  చ్చిన కొద్ది రోజులకే విద్యార్థులకు మళ్లీ ఆరుబయట ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చేసింది. కప్పరాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తరగతి గదుల్లో భోజనాలు చేయడానికి సిబ్బంది అంగీకరించలేదు. ఒకవైపు వర్షం పడి బురదమయంగా మారిన పాఠశాల ఆవరణలో ఆరుబయటే విద్యార్థులను కూర్చోబెట్టేశారు. ఆ అపరిశుభ్ర వాతావరణంలోనే మధ్యాహ్న భోజనాలు వడ్డించారు.
 
విద్యార్థులు బతిమాలినా.. 
బురదగా ఉందని.. గదుల్లో కాకపోయినా కనీసం వరండాలో అయినా తింటామని విద్యార్థులు బతిమలాడినప్పటికీ అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారులు ఆరు బయట బురదలోనే కూర్చొని భోజనాలు చేయాల్సి వచ్చింది. దీనిపై కొంత మంది స్థానికులు పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. 

పిల్లలు గదులను పాడు చేసేస్తారని, అందుకే లోపల తినొద్దని చెప్పామని సిబ్బంది చెప్పడం గమనార్హం. బురదలో విద్యార్థులకు భోజనాలు పెట్టడాన్ని స్థానికులు తమ ఫోన్లతో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రసుత్తం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ దృశ్యాలను చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు అప్పటి, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ నిట్టూరుస్తున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)