Breaking News

బతకాలంటే భయమేస్తోందమ్మా.. నన్ను క్షమించు తమ్ముడు ...

Published on Mon, 01/20/2025 - 11:31

నెల్లిమర్ల: తమ కుమారుడు వైద్య వృత్తిలో స్థిరపడతాడని ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్‌ పట్టా పుచ్చుకుని, రోగులతో పాటు తమకు కూడా వైద్యసేవలు అందిస్తాడని  ఆశ పడ్డారు. అయితే వారి ఆశలు ఆడియాసలయ్యాయి. చేతికి అందివచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం నుంచి బ్యాక్‌లాగ్స్‌ ఉండిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

పోలీసులు, సహ విద్యార్థులు అందించిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మిమ్స్‌ వైద్య కళాశాలలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన అతుకూరి సాయి మణిదీప్‌(24) ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్‌ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌లో పురుగుల మందు తెప్పించుకుని, కూల్‌ డ్రింకులో కలుపుకుని తాగా డు. విషయం తెలుసుకున్న సహ విద్యార్థులు విషయాన్ని మిమ్స్‌ యాజమాన్యానికి తెలియజేశారు. 

యాజమాన్య ప్రతినిధులు నెల్లిమర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ గణేష్‌ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయి మణిదీప్‌ బెడ్‌ కింద పోలీసులకు సూసైడ్‌ నోట్‌ లభించింది. చదువు విషయంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సదరు నోట్‌లో మృతుడు ప్రస్తావించాడు. బ్యాక్‌ లాగ్స్‌ ఎక్కువగా ఉండటం, చదువుపై ఏకాగ్రత లేకపోవడంతో చనిపో తున్నట్లు రాసాడు. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేష్‌ తెలిపారు.   

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)