Breaking News

స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌

Published on Thu, 11/05/2026 - 20:38

సాక్షి,చిత్తూరు: చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  కుప్పం నియోజకవర్గంలోని  శాంతిపురం మండలం కడపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులు భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ రిగ్గింగ్‌ సైతం చంద్రబాబు ఇంటి వద్ద జరగడం గమనార్హం.

కడపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాల్లో బరితెగించిన టీడీపీ గూండాలు, పోలింగ్ బూత్‌లలోకి బలవంతంగా చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడి చేసి బయటకు పంపేశారు. అంతేకాకుండా, ఏకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని సైతం ఓటు వేయకుండా అడ్డుకుని బలవంతంగా వెనక్కి పంపడం చర్చాంశనీయంగా మారింది. 

ఇదే ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓటర్లతో కడపల్లిలో అక్రమంగా ఓట్లు వేసిన ఘటనలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఓటు వేసేందుకు వచ్చిన సాధారణ ఓటర్లను సైతం టీడీపీ గూండాలు బెదిరించి బయటకు గెంటేశారు.

రోడ్డుపై బైఠాయించి ఓటర్లు, కార్యకర్తల ఆందోళన
టీడీపీ మూకల ఈ అరాచకాలు, రిగ్గింగ్‌ను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, బాధిత ఓటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కడపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార పార్టీ నాయకులు పోలీసుల సమక్షంలోనే అక్రమాలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. చంద్రబాబు సొంతూళ్లోనే ఇలాంటి ఘటనలు జరగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో కుప్పం ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)