Breaking News

వైఎస్‌ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్..

Published on Thu, 10/09/2025 - 20:16

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన సూపర్‌ సక్సెస్‌ అయ్యింది.  ప్రభుత్వ పెద్దల కుట్రలు, పోలీసుల అడ్డంకులు అన్నీ దాటి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మాకవరపాలెం మెడికల్‌ కాలేజీ వరకు జగన్ వెంట జనం నడిచారు.

అనకాపల్లి నుంచి రాజుపాలెం వరకు కుండపోత వర్షం కురిసినా, ప్రజల ఉత్సాహం తగ్గలేదు. మహిళలు, వృద్ధులు వర్షంలో తడుస్తూనే జగన్ కోసం ఎదురు చూశారు. కొత్తూరు జంక్షన్ వద్ద టీడీఆర్ బాధితులు, వర్షంలో తడుస్తూనే జగన్‌ను కలిశారు. తాళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్లు చెరువులా మారినా, గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ రైతులు మోకాళ్ల లోతు నీళ్లలో జగన్ కోసం వేచి చూశారు. రైతుల కష్టాన్ని చూసి చలించిన జగన్, వర్షంలో తడుస్తూనే బాధితులతో మాట్లాడారు.

జగన్ పర్యటనను విఫలం చేసేందుకు అధికారిక యంత్రాంగం ప్రయత్నించినా, ప్రజల ఆదరణ ఆ ప్రయత్నాలను తుడిచిపెట్టేసింది. కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, జగన్ కాన్వాయ్‌లోని వాహనాలను నిలిపి వేసినా, క్యాడర్‌ పొలాల నుంచి బైకులపై వచ్చి, వర్షంలోనూ హారతులు పట్టారు. గుమ్మడి కాయలతో స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఉత్తరాంధ్ర మార్మోగింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి మాకవరపాలెం వరకు 63 కి.మీ. దూరాన్ని 6 గంటలకు పైగా ప్రయాణించి, ప్రజల ఆదరణతో జగన్ పర్యటన సూపర్‌ సక్సెస్‌గా నిలిచింది. ఈ పర్యటనతో వైఎస్సార్‌సీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు