Breaking News

కాశీయాత్రలో విషాదం

Published on Tue, 06/09/2026 - 06:01

సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీ యాత్రకు 43 మందితో బయ­లుదేరిన టూరిస్టు బస్సు బిహార్‌ రాష్ట్రంలోని గయ జిల్లా బుద్ధగయ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి ప్రమా­దానికి గురైంది. ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బస్సులోని ముగ్గురు యా­త్రికులు దుర్మరణం చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడగా, పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల్లో సంగంకు చెందిన టూరిస్టు బస్సు నిర్వాహకుడు, విశ్రాంత ఆర్టీసీ కండక్టర్‌ పసుపులేటి వెంకటేశ్వర్లు (64), వంట మాస్టర్‌ చవడం హజరత్తయ్య (57), ఆత్మకూరు­కు చెందిన సోమా పద్మావతి (43) ఉన్నారు.

తీవ్రంగా గాయపడిన వారిలో సంగంకు చెందిన బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ, నీలం శీనయ్య, పద్మ, వింజమూరు శివరంగయ్య, లక్ష్మమ్మ, కంటాబత్తిన సంపూర్ణమ్మ, కంటాబత్తిన కామాక్షమ్మ, గురవయ్య, డి.రమణమ్మ, జి.శ్రీదేవి, డి.మల్లేశ్వరి ఉన్నారు. ఆత్మకూరు, దుత్తలూరుకు చెందిన పలు­వురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యా­యి. క్షతగాత్రులకు గయలోని అనుగ్రహ నారాయణ మగధ మెడికల్‌ కళాశాలలో చికిత్స అందిస్తున్నా­రు. కాగా క్షతగాత్రులకు హిందీ భాష తెలి­యక  ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైద్యులు మా­త్రం క్షతగాత్రులకు చికిత్స అందించి కాపాడారు. సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.

బస్సు ప్రమాదం బాధాకరం: వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు బీహార్‌లోని ఔరంగాబాద్‌ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమా­దంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నా­రు.

మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)