Breaking News

భార్యపై అనుమానం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

Published on Wed, 01/08/2025 - 08:38

ఆదోని అర్బన్‌: పట్టణంలోని పూలబజార్‌లో నివాసముంటున్న శైలజ (22) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ సీఐ శ్రీరామ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడున్నర సంవత్సరాల క్రితం విక్టోరియాపేటకు చెందిన కృష్ణ కుమార్తె శైలజ, శక్తిగుడి ప్రాంతంలో నివాసముంటున్న నాగరాజు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

 నాగరాజు ఓ ప్రయివేట్‌ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండగా, శైలజ లేడీస్‌ కార్నర్‌లో పని చేస్తోంది. వీరికి రెండేళ్ల కుమార్తె మౌనిక ఉంది. భర్త ప్రతిరోజూ భార్యపై అనుమానం పడడం, లేడీస్‌ కార్నర్‌లో పనిచేయగా వచ్చిన డబ్బు తనకే ఇవ్వాలని వేధించేవాడు. 

దీంతో శైలజ మనస్తాపానికి గురై సోమవారం రాత్రి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కాపేపటికి గమనించిన కుటుంబసుభ్యులు కిందకు దింపి ఆదోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)