Breaking News

బిడ్డను చంపి.. తనువు చాలించి..

Published on Thu, 06/05/2025 - 08:48

కాకినాడ క్రైం: కన్న పేగుని చిదిమేసి తానూ తనువు చాలించిన తల్లి హృదయ విదారక సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, రాజమహేంద్రవరానికి చెందిన గుడేటి రమ్యదీప్తి(30)కి ఐదేళ్ల క్రితం కాకినాడ రేచర్లపేట దౌర్లవారి వీధికి చెందిన రాజాల శరత్‌తో వివాహమైంది. ఈ దంపతులు అబుదాబీలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కియాన్‌ ప్రశాంత్‌ ఉన్నాడు. రెండు నెలల క్రితం రమ్యదీప్తి అబుదాబి నుంచి తన కుమారుడితో కలిసి రాజమహేంద్రవరానికి వచ్చింది. 

అక్కడ ఒకటిన్నర నెలల పాటు ఉండి, సుమారు పది రోజుల క్రితం కాకినాడలోని అత్తయ్య ఇంటికి వచ్చి ఉంటోంది. ఏమైందో, ఏమో మంగళవారం రాత్రి నిద్రపోయేందుకు కుమారుడితో కలిసి తన గదిలోకి వెళ్లింది. ఉదయం ఎంతకూ తలుపు తీయకపోయేసరికి దీప్తి అత్తయ్య, ఆడపడుచు కిటికీ నుంచి గదిలోకి చూశారు. దీప్తి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆమె కుమారుడు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. పొరుగు వారి సాయంతో తలుపులు తెరిచిచూడగా.. దీప్తి అప్పటికే చనిపోయి ఉంది. బాలుడు ప్రశాంత్‌కు ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి ఉన్నాయి.

 దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్‌ ఇన్‌చార్జి సీఐ సత్యనారాయణ, ఎస్సై తులసీరామ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప్తి ఆత్మహత్యకు పాల్పడిందని, అంతకు ముందు తన కుమారుడి ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి, ఊపిరాడకుండా చేసి ఉంటుందని గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దీప్తి ఈ ఘాతుకానికి పాల్పడిందని భావిస్తున్నామని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని సీఐ చెప్పారు. 

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాఉంటే, అత్త, ఆడపడుచు, భర్త వేధింపులు తాళలేకున్నానని దీప్తి తమకు వాయిస్‌ మెజేస్‌లు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడిందని దీప్తి తల్లి అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్‌ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)