Breaking News

భర్త మొబైల్‌లో పక్కంటి మహిళ ఫోన్‌ నంబరు..

Published on Wed, 04/02/2025 - 13:13

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఇరు కుంటుంబాలు పక్కపక్కనే ఉంటాయి.. తెల్లారితే ఒకరి ముఖాలు.. ఒకరు చూసుకోవాలి. తీరా బంధువులు కూడా.. అయితే ఏమైందో..ఏమో కానీ..ఆ ఇరు కుటుంబీకు ల మధ్య కొన్ని నెలల కిందట వివాదం తలెత్తింది. దూరం పెరిగింది. మాటల్లేవ్‌.. ఈ తరుణంలో భర్త ఫోన్‌లో ఆ పక్కంటి మహిళా ఫోన్‌ నంబరు ఉందని భార్య గొడవకు దిగింది. దీంతో మనస్తాపానికి గురైన పక్కంటి మహిళా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. పదెంకెల ఫోన్‌ నంబరు తెచ్చిన తంటాకు ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన మంగళవారం చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రా మంలో చోటుచేసుకుంది.

గ్రామస్తులు, పోలీసులు వివరాల మేరకు...చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్‌ భార్య ఉమ (30). ఈ దంపతులకు పెళ్లిలై ముగ్గురు పిల్లలున్నారు. వీళ్ల ఇంటి పక్కనే శివమణి, సుజాత అనే దంపతులు  ఉన్నారు. ఈ ఇరుకుటుంబీకులు దగ్గర బంధువు లు. వీళ్ల మధ్య ఏర్పడిన చిన్న తగదాలు గొడవగా మారాయి. కొన్ని నెలలుగా ఈ ఇరు కుటుంబీకుల మధ్య మాటలు లేవు. అయితే సోమవారం శివమణి మొబైల్‌లో ఉమ ఫోన్‌ నంబరును సుజాత గమనించింది. ఆ నంబరు నీ ఫోన్‌లో ఎందుకు ఉందని సుజాత భర్తతో వాగ్వాదానికి దిగింది.

 ఇలా అక్రోశానికి గురైన సుజాత  రోడెక్కింది. ఉమతో గొడవకు దిగింది. ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. ఇలా మాట మాట పెరిగి జట్టు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనా ఉమ సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఈక్రమంలో జాకెట్‌లోని అట్టముక్కలో తన చావుకు కారణం సుజాతనేని రాసి పెట్టింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.  అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళా ప్రాణాన్ని బలి తీసుకుంది.  క్షణికావేశానికి గురై ఆ మహిళ పరువుకు తలొంచి ఆత్మహత్య చేసుకుంది. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)