Breaking News

పెళ్లిలో భర్తతో డాన్స్‌.. కొన్ని గంటల్లోనే మృతి

Published on Sun, 03/31/2024 - 05:56

మక్కువ: పెళ్లైన ఆనందంలో భర్తతో కలిసి డాన్స్‌ చేసి­న నవ వధువు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగెడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దబ్బగెడ్డ గ్రామానికి చెందిన భాస్కరరావుతో పార్వతీపురం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన అఖిల(20)కు శుక్రవారం రాత్రి పెళ్లి జరిగింది. మాంగల్యధారణ అనంతరం శనివారం తెల్లవారు జామున 3 గంటల వరకు ఊరేగింపు సాగింది. డీజే పాటలకు భర్తతో కలిసి అఖిల డాన్స్‌ చేసింది. అనంతరం నీరసంగా ఉం­దం­టూ నిద్రలోకి జారుకుంది.

తర్వాత బంధువులు వెళ్లి లేపగా, ఎంతకూ లేవకపోవడంతో వెంటనే మక్కు­వ పీహెచ్‌సీకు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అందిన అనంతరం మెరుగైన చికిత్స కోసం సాలూరు సీహెచ్‌సీకు తరలించారు. అక్కడి వైద్యు­లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అఖిలకు తల్లిదండ్రులు లేరు. నానమ్మ, తాతయ్యల వద్దే పెరిగింది. ముందు రోజు ఉపవాసం ఉండటం, పెళ్లి తర్వాత డాన్స్‌ వేయడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై మృతి చెంది ఉండవచ్చునని గ్రామస్తులు, బంధువులు భావిస్తున్నారు.

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)