పోలింగ్‌ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి 

Published on Fri, 03/22/2024 - 05:51

ఎన్నికల కమిషన్‌కు ఏపీ మహిళా కమిషన్‌ విజ్ఞప్తి  సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు (గర్భిణులు, బాలింతల) పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి ఏపీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు.

పోలింగ్‌ బూత్‌ల వద్ద మహిళలకు ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటుచేయాలని, బాలింతల కోసం ఫీడింగ్‌ రూమ్‌ అందుబాటులో ఉంచాలని కోరారు. గర్భిణులకు అత్యవసర పరిస్థితిలో వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళలు వడదెబ్బకు గురికాకుండా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద షెల్టర్లు ఏర్పాటుచేయాలని, మంచినీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.

మహిళల కోసం ప్రత్యేకంగా మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. దాడులు, లైంగికదాడులు, వేధింపులకు గురైన మహిళలకు తగిన న్యాయం చేసేందుకు, బాధితులను పరామర్శించేందుకు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్, సభ్యులకు ఎన్నికల నిబంధనలలో సడలింపు ఇవ్వాలని కోరారు. గిరిజన మహిళలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్‌కు అనుమతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)