Breaking News

గోదావరి-కావేరి అనుసంధానంపై ముందడుగు!

Published on Mon, 10/27/2025 - 05:04

సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానానికి ముందడుగు పడింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 148 టీఎంసీలను తాత్కాలికంగా తరలించేలా అనుసంధానం చేపడతామని చెబుతున్నారని, హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక వాటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లిస్తామని అంటున్నారని, అసలు హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఏపీ సర్కార్‌ కోరింది.

జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి 75వ సమావేశం ఈ నెల 1న కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతారావు అధ్యక్షతన జరిగింది. అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించారు. ఆ వివరాలను పాలకమండలి విడుదల చేసింది.

రాష్ట్రాల సమ్మతి ప్రకారమే.. 
ఇంద్రావతి సబ్‌ బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 148 టీఎంసీల గోదా­వరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌(కృష్ణా), సోమశిల(పెన్నా), అరణియార్‌ రిజర్వాయర్‌ల మీదుగా కావేరికి గోదావరి జలాలను తరలించేలా 2022లో ఎన్‌డబ్ల్యూడీఏ డీపీఆర్‌ను రూపొందించింది. అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామని పేర్కొంది. కావేరికి తరలించే 148 టీఎంసీల గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు కలిపి మొత్తం 166.5 టీఎంసీల్లో... తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్‌కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామని తెలిపింది. దీనివల్ల 6,78,797 హెక్టార్లకు సాగునీరు, తాగునీటిని అందించవచ్చని పేర్కొంది.

ఈ డీపీఆర్‌పై బేసిన్‌లోని రాష్ట్రాలతో కేంద్రం పలుమార్లు సంప్రదింపులు జరిపింది. తాజా సమావేశంలో ఇంద్రావతి సబ్‌ బేసిన్‌లో ట్రిబ్యునల్‌ కేటాయించిన జలాలను తాము వాడుకుంటామని.. అదనంగా ఉన్న నీటిని కావేరికి మళ్లిస్తే తమకు అభ్యంతరం లేదని ఛత్తీస్‌గఢ్‌ పేర్కొంది. ఈ అనుసంధానానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అనుసంధానం ద్వారా మళ్లించే జలాల్లో 50 శాతం తమకు కేటాయించాలని కోరింది. గోదావరిలో నికర జలాల్లో మిగులు లేదని.. తాత్కాలికంగా ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని నీటినే కావేరికి తరలిస్తామని కేంద్రం చెబుతోంది.

హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక.. ఆ నీటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లి­స్తా­మ­ని అంటోంది. ఈ నేపథ్యంలో హిమాలయ నదుల నీ­టిని గోదావరికి ఎప్పుడు తెస్తారో చెప్పాలని ఏపీ కోరింది. లే­దంటే తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలిపింది. కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా పెంచాలని కర్ణాటక, మహారాష్ట్ర డిమాండ్‌ చేశాయి. తక్షణమే అనుసంధానం చేపట్టాలని తమిళనాడు, పుదుచ్చేరి కోరగా.. కావేరి జలాల్లో అదనపు వాటా కావాలని కేరళ డిమాండ్‌ చేసింది. బేసిన్‌లోని రాష్ట్రాల సమ్మతి, ట్రిబ్యునల్‌ అవార్డుల ప్రకారమే ఈ అనుసంధానం చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)