Breaking News

మా ఎమ్మెల్యేకు నెలనెలా రూ.30 లక్షలు ఇవ్వాలట..

Published on Mon, 12/02/2024 - 04:19

మదనపల్లె: ‘మా ఎమ్మెల్యే నన్ను పనిచేసుకోనివ్వట్లేదు. ప్రతినెలా రూ.30 లక్షలు కప్పం కట్టమంటున్నారు. ఆయన పురమాయించిన పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ చేసి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆయన అక్రమాలకు సహకరించకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. నేను అవినీతిపరురాలినని.. పార్టీ అనుకూల పత్రికల్లో వార్తలు రాయించి వేధింపులకు గురిచేస్తున్నారు’.. అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసీల్దార్‌ ఖాజాబీ ఏకంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను స్వయంగా కలిసి చెప్పు­కున్న గోడు ఇది.

తాను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరి­స్థితులు కల్పించాలని ఆమె వారిని వేడుకున్నారు. అధి­కార పారీ్టకి చెందిన మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషాపై అక్కడి తహసీల్దార్‌ నేరుగా ముఖ్యమంత్రినే కలిసి ఆరోపించడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. పాలనా వ్యవహారాల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల అరా­చకం ఈ సంఘటనకు అద్దంపడుతోంది. తన ఫిర్యా­దులో తహసీల్దార్‌ ఖాజాబీ ఇంకా ఏం పేర్కొన్నారంటే.. 
ఆఫీసుకు రాకుండా అడ్డుకుంటున్నారు..

‘ఆయన చెప్పిన పనులు వీలుకాక పోయినా చేసి తీరాల్సిందేనంటున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగే ప్రతీ­పని తనకు చెప్పి చేయాలని బెదిరిస్తున్నారు. మండలంలోని బసినికొండ గ్రామం సర్వే నంబర్లు 718/8ఎ, 774/3, 510/­1ఏ/2, వెంకప్పకోట సర్వే నంబర్‌.71/2కు సంబంధించి రెవెన్యూ చట్టం ప్రకారం సరిగ్గా ఉండడంతో మ్యుటేషన్‌ చేశానని, ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎందుకు చేశావంటూ బెది­రిస్తూ, నన్ను ఆఫీసుకు రానివ్వకుండా అడ్డుకుంటు­న్నారు. ఇక కోళ్లబైలు గ్రామం సర్వే నంబర్‌ 965/5, 595లో 1.80 ఎకరాల్లో లేఔట్‌ వేసి రెండు సెంట్ల చొప్పున ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాలన్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు సెంట్లు ఇచ్చే అవకాశంలేదని చెబితే వినిపించుకోలేదు.

ల్యాండ్‌ కన్వర్షన్లు, మ్యుటేషన్లు తదితర రెవెన్యూ సేవ­లు ఎమ్మెల్యేకు చెప్పకుండా చేయరాదని హుకుం జారీచేశారు. అలాగే,  తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ అస్లాం బాషాను ఎమ్మెల్యే తన చెప్పుచేతల్లో ఉంచుకుని, రికా­ర్డులను సబ్‌ కలెక్టరేట్, కలెక్టరేట్‌కు పంపకుండా, పాలనాపరమైన పనులు జరగనీయకుండా అడ్డుకుంటూ, మానసికంగా నన్ను తీవ్ర ఒత్తిడులకు గురిచేస్తున్నారు. పైగా.. టీడీపీ అనుకూల పత్రికలో నాపై అసత్యాలు ప్రచా­రం చేయి­ంచారు’.. అంటూ ఆమె సీఎం, లోకేశ్‌ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)