మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
MLA Thippeswamy: నేను క్షేమంగానే ఉన్నా.. ఎమ్మెల్యే తిప్పేస్వామి
Published on Wed, 06/01/2022 - 14:26
మడకశిర (సత్యసాయి జిల్లా): తాను క్షేమంగానే ఉన్నట్లు మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు వద్ద సోమవారం రాత్రి ఎమ్మెల్యే కారు, ఓ మినీ ట్రాక్టర్ ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ విషయం చక్కర్లు కొట్టడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు ప్రమాదంలో ఎమ్మెల్యేకు ఏమైందోనని ఆందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ‘సాక్షి’తో మాట్లాడి టెన్షన్‌కు తెరదించారు. ప్రమాదం జరిగిన సమయంలో అసలు తాను కారులోనే లేనని ఆయన తెలిపారు. బెంగళూరులో తనను వదిలిన అనంతరం కారు డ్రైవర్ తిరుపతికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు.
చదవండి👉 ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులకు ‘ఆన్‌లైన్ అవకాశం’
Tags : 1